రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

212

– టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి రామయ్య

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విభాగం విధినిర్వహణ, విద్యుక్త ధర్మానికి తిలోదకాలిచ్చిందని, సంబంధంలేని పనులు చేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు .ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

రాష్ట్రంలో శాంతిభద్రతల విభాగం పనితీరుపై ప్రతిపక్షాలు, మీడియా ఎంతగా గగ్గోలు పెడుతున్నా, ప్రభుత్వం, ముఖ్యమంత్రినుంచి మౌనమే సమాధానమవు తోంది. ఏ సందర్భంలోనైనా సరే, ముఖ్యమంత్రి ఏనాడైనా మీడియాతో మాట్లాడుతూ, ఎనీ కొశ్చన్స్ అనే ప్రశ్న వేయగలిగారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడమేకానీ, ముఖ్యమంత్రి ఏనాడూ అలాప్రవర్తించలేదు. ఆయనలో ఎప్పుడూ ఒకవణుకు కనిపిస్తూనేఉంటుంది. ప్రతిపక్షం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటే డీజీపీ కార్యాలయంలో ఒక విస్ఫోటనం రావాలి. కానీ అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడంలేదు? ఎప్పుడూ రానూలేదు. ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ చేయాల్సిన డీజీపీ ఏం చేస్తున్నాడు? తన బాధ్యతలను అధికారిగా ఆయన విస్మరించాడు కాబట్టే, పదేపదే పౌరుడిగా తాను గుర్తు చేయాల్సి వస్తోంది. 5కోట్ల మందిని సమానంగా చూడాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉంది. డీజీపీ తనబాధ్యతల నిర్వహణపై తనదృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం లేదు.

తరతమ బేధాలు, తేడాలు లేకుండా రాజకీయపార్టీలతోసంబంధంలేకుండా డీజీపీ వ్యవహరించాలి. అంతేగానీ సీఎంచెప్పింది చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి, సారాయి గంజాయి కేసులుపెట్టడానికి కాదు పోలీసులుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గలో వల్లెపు అశోక్ అనే బీసీ యువకుడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చావబాది, లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ జరిగితే, మృతుడి భార్య, కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పకుండా పోలీసులు అతని మృతదేహాన్ని పూడ్చమని, కాల్చమని ఎలా చెబుతారు? పులివెందులలోని స్థానిక వైసీపీనేతల ఆదేశాలప్రకారమే పోలీసులు అలా వ్యవహరించారా? అశోక్ మృతదేహాన్ని పూడ్చండి… కాల్చండనే డైరెక్షన్ సీఎంవో నుంచే వచ్చిందా? లేక స్థానికపోలీసులే అదంతా చేశారా? (అశోక్ మృత దేహాన్ని కాల్చిన కాటికాపరి వేరేవ్యక్తితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియోను ఈ సందర్భంలో రామయ్య విలేకరులకువినిపించారు.) శవాన్ని రాత్రిపూట కాల్చకూడదని తెలిసీ, భార్యబిడ్డలకు బంధువులకు చెప్పకుండా, కాల్చాలనే ఆలోచన పోలీసులకు ఎందుకొచ్చింది? ముఖ్యమంత్రి నియోజకవర్గమంతా ఇలానే అరాచకంగా ఉంటుందా? అక్కడి పోలీసులు ఇదేవిధంగా చట్టాన్ని, న్యాయాన్ని ఖాతరుచేయకుండా ప్రవర్తిస్తారా? సీఎంఏంచెబితే, డీజీపీ అదేచేస్తారా? ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే, అరాచకానికి అడ్డానా? అశోక్ లాకప్ డెత్ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి. తన నియోజకవర్గంలో అరాచకంలేదని ముఖ్యమంత్రి భావిస్తే, అదేవాస్తవమని ప్రజలకుతెలియాలంటే, ఆయన తక్షణమే లాకప్ డెత్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ధర్మం నాలుగుపాదాలతో నడుస్తోందని డీజీపీ భావిస్తే, తక్ష ణమే తమడిమాండ్ కు ఆయన కూడా అంగీకరించి, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలి.

రాష్ట్రంలో న్యాయం ఎలా అమలవుతోందనడానికి మజ్జి అనే యువకుడి ఉదంతమే నిదర్శనం. ఎప్పుడో సంవత్సరం క్రితం తెలంగాణ నుంచి రెండు మద్యంసీసాలు తెచ్చుకున్న యువకుడిపై పోలీసులు ఇప్పుడు గంజాయికేసు పెడతామని బెదిరించి, చివరకు అతని చావుకి కారణమ య్యారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో మద్యంసీసాలకు గంజాయి పుట్టిం దా? రెండు మద్యంసీసాలు తెచ్చుకున్న పాపానికి యువకుడు బలై పోవాలా? మజ్జిని వేధించి, అతన్ని రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన, ఎస్ఐ, కానిస్టేబుళ్లపై ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంది? ముఖ్యమంత్రి, డీజీపీల అసమర్థతవల్లే మజ్జి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారిపై తక్షణమే ఐపీసీ 306 కేసు నమోదుచేసి, అరెస్ట్ చేసి, శాఖాపరమైన విచారణజరపాలి. గుంటూరుజిల్లాలో అలీషా అనే మైనారిటీ యువకుడి చావుకి కారకులెవరు? అలీషా కాళ్లపైకి ద్విచక్రవాహనం ఎక్కించిమరీ వేధించిన ఎక్సైజ్ పోలీసులపై డీజీపీ ఏంచర్యలు తీసుకున్నారు? పల్నాడులో విక్రమ్ మరణానికి, చిత్తూరులో ఓంప్రతాప్ చావుకి, చీరాలలో కిరణ కుమార్ బలవన్మరణాలకు కారకులైన పోలీస్ అధికారులపై డీజీపీ ఏంచర్యలు తీసుకున్నారు? ఆయా ఘటనల్లో ప్రమేయమున్న సదరు అధికారులను తక్షణమే అరెస్ట్ చేసి, విచారించాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసులో అసలు దోషులను డీజీపీ ఇంతవరకు ఎందుకు శిక్షించలేకపోయారు? శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి స్పందించినా, జగన్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించి, అసలు నిందితులను అరెస్ట్ చేయలేదు. పోలీసులప్రమేయంతో, వారి వేధింపులు తాళలేక చనిపోయిన వారి మరణాలపై ప్రభుత్వం తక్షణమే విచారణజరిపించాలి. మృతుల కుటుంబాలకు వెంటనే కోటిరూపాయల పరిహారం అందచేయాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సంక్షేమపథకాలు చూసి నక్సలైట్లు లొంగిపోతున్నారని చెప్పడానికి డీజీపీఎవరు? అంటే నక్సలైట్ల లొంగుబాటులో పోలీసుల శ్రమేం లేదని డీజీపీ తనకు తానే ఒప్పుకున్నారా? ధర్మాన్ని, చట్టాన్ని కాపాడుతూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయాల్సిన డీజీపీ పథకాలు బాగున్నాయని ఎలా చెబుతారు? చందమామ కథలను మించిపోయేకథలను వివేకాహత్యకేసు విచారణలో రోజూ వింటున్నాం. వివేకాహత్యకేసు విచారణలో ఇంటిదొంగలను పక్కనపెట్టి, సంబంధంలేని వ్యక్తులచుట్టూ సీబీఐ విచారణ సాగుతోంది. ముఖ్యమం త్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి వాస్తవాలను గ్రహించాలి. డీజీపీ తనపంథా మార్చుకొని విధినిర్వహణలో నిజాయితీగా, నిక్కచ్చిగా చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం.