తెలుగుదేశం పార్టీ కాదు..రాజకీయ విశ్వవిద్యాలయం:ప్రసూన

265

ఎంతోమందికి రాజకీయ భిక్షపెట్టిన టీడీపీ ఒక రాజకీయపార్టీ కాదని, రాజకీయ విశ్వవిద్యాలయమని మాజీ ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వారిలో కేసీఆర్ సహా అంతా టీడీపీ స్కూలు విద్యార్ధులేనన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రసూన ఏమన్నారంటే.. మనకి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరరాలు అయిన మనం ఇంకా అన్ని విషయలో అయోమయ పరిస్థితులు ఎదురుకావడం చాలా సిగ్గు చేటు. దేశానికి వెనుముక యువత, రైతులే .. కానీ ఈ రోజు యువత చెడుదారి పట్టడం బాధగా ఉంది ..అలాగే రైతుల ఆత్మహత్య లు మనసును కలచివేస్తున్నాయి. వివేకానంద స్పూర్తితో యువత మంచి లక్ష్యం తో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన మనం కానీ ఈ రోజు గంజి కి ,గుడ్డ కి నోచుకోని కుటుంబాలు చాలా ఉన్నాయి వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం కోట్లు కుమ్మరించి ఉప ఎన్నికలకు వెళ్తుంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలో యావత్ ప్రజానీకం అర్ధం చేసుకోవాలి . మీడియా లో చాలా ఛానల్ లు కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తున్నాయి.4th ఎస్టేట్ గా చెప్పుకొనే మీడియా ఇలా ఏక పక్షము గా వ్యవహారించడం వల్ల , జాతి మనుగడకు ముప్పు ఉంటుంది ..దీనిని మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది . ఎంతో హృదయ వికార బాధతో చెపుతున్నా మాటలే తప్ప ఎవరిని కించపరిచే విధంగా కాదు.

హుజురాబాద్ లో కొన్ని రాజకీయ పార్టీ లు కోట్లు కుమ్మరించి ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అయ్యారు . దళితు బంధు అని ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది . తెలంగాణ లో చాలా జిల్లాలో ఈ రోజుకి కూడా ఆకలికి తో అల్లాడే కుటుంబాలు కొన్ని లక్షలో ఉన్నాయి. ఎవరు ఏది మాట్లాడిన చంద్రబాబు ని లక్ష్యం గా పెట్టుకొనే కొన్ని పార్టీ లుదూషిస్తున్నారు.అలా మాట్లాడే వారికి సిగ్గు ఉండాలి. మా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రాజకీయా నాయకులే ఈ రోజు అన్ని పార్టీలలో ఉన్నారు.. అది మా పార్టీ గొప్పతనం. ఒక్క రేవంత్ రెడ్డి ఏ కాదు అన్ని రాజకీయ పార్టీలో ఉండే ప్రతి ముఖ్య నాయకుడు మా తెలుగుదేశం వాళ్లే. చంద్రబాబు నాయుడు గురుంచి మాట్లాడే స్థాయి మీది కాదు. చంద్రబాబు నాయుడుపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబడ్దార్ .

రవాణా వ్యవస్థ ని అస్తవ్యస్తం చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పల్లె లో ప్రజలు రవాణా వ్యవస్థ సరిగా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. చాలా గ్రామాల్లో ఆడ పిల్లను లిఫ్ట్ పేరుతో చాలా ఏరియా లో బలమతం చేయడం చూస్తుంటే హృదయం తరుక్కపోతుంది. పల్లెలో బస్ లు తీసివేసి ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వమే గండి కొడుతోంది ..పల్లెలో ప్రజలకు సరైన రవాణా ఏర్పాటు చేసి వాళ్ళకి రవాణా వ్యవస్థ ని సుగమం చేయాలి. కేవలం రవాణా నే కాదు ,విద్య వ్యవస్థ లో కూడా చాలా మార్పులు రావాలి. పాఠశాల లు మూసివేసి విద్య వ్యవస్థ ని నిర్వీర్యం చేయడం సరైన పద్ధతి కాదు. బడుగు బలహీన వర్గాలకు విద్య వ్యవస్థ లో మొండి చేయి చూపిస్తున్నారు .

ఆన్లైన్ లో చదువులు కోసం పిల్లలు చాలా మంది ఫోన్ లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ..అలాంటి వారికి ఫోన్ లు ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్య అందించాలి కానీ ఎన్నికలో కోట్లు కుమ్మరించి హుజురాబాద్ ఎన్నికల కు ప్రభుత్వం వెళ్లడం సిగ్గుచేటు. పేద పిల్లలకు విద్య, ప్రతి పల్లెలో రవాణా వ్యవస్థ ని సరైన మార్గంలో నడిపించాలిస్న బాధ్యత ఈ ప్రభుత్వనీది..మరొక సారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న. , ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదు.