ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం

127

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.