రైతుభరోసా కేంద్రాలు,రైతులకు భారాన్నే మిగులుస్తున్నాయి

96

– మాజీఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో విజయశేఖర్ రెడ్డి అనేరైతు ఆత్మహత్య చేసుకు న్నాడని, పండినపంటలకు గిట్టుబాటుధరలేక అప్పులభారంతోనే సదరు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తననివాసంనుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంపట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం అంతిమంగాఅన్నదాతల మరణాలకు కారణమవుతోందన్నా రు. తాను రైతుకుటుబంనుంచే వచ్చాననిచెప్పి, అన్నదాతల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు వారికేంచేశాడో సమాధానం చెప్పా లని టీడీపీనేత డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 1000మంది వరకు అన్నదాతలు చనిపోయారని, మరణించిన రైతులకుటుంబాలను ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఆదుకోలేకపోయాడన్నారు. తననియోజకవర్గంలోని వేములమండలం నారేపల్లి కి చెందని విజయశేఖర్ రెడ్డి అప్పులభారంతోచనిపోతే, ఈ ముఖ్యమంత్రి సదరు రైతుకుటుంబ పరిస్థితులగురించి కూడా ఆరాతీయలేదన్నారు. కనీసం అక్కడు న్న అధికారపార్టీ నేతలు కూడా విజయశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించ లేదన్నారు. విజయశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటిరూపాయల ఆర్థికసహాయం చేయాలని జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయంపై చూపుతున్న నిర్లక్ష్యం, అన్నదాతలపై చూపుతున్న సవతితల్లి ప్రేమే, రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలకు కారణమన్నారు. సున్నావడ్డీ, రైతుభరోసా, పంటలబీమా, ఆర్బీకేలు, అన్నదాతలకు ఏవిధంగాను ఉపయోగపడలేకపోతు న్నాయన్నారు. కరోనా సమయంలో రైతులకు సరైన గిట్టుబాటు ధరకూడా కల్పించలేకపోయారన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీ మా సాయాన్ని వైసీపీ నేతలు చెప్పినవారికే ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు.

పంటలబీమా తాలూకా ప్రభుత్వవాటాను, రైతులవాటాను తామే కడతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆసొమ్ముని సకాలంలో చెల్లించకపోవడంతో, రాష్ట్రవ్యా ప్తంగా అనేకమంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ధాన్యంతాలూకా కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలనుకూడా ప్రభుత్వం ఇంతవరకు చెల్లించక పోవడం సిగ్గుచేటని మాజీఎమ్మెల్యే మండిపడ్డారు. టీడీపీప్రభుత్వంలో రైతులకు అనేకరకాల పథకాలు అమలుచేసి, సాగునీటిరంగానికి వేలకోట్ల నిధులు ఖర్చుచేయడం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక సాగు నీటిప్రాజెక్టులను పడుకోబెట్టి, రైతులు వినియోగిస్తున్న విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడన్నారు. రైతుభరోసా కింద రూ.13,500 ఇస్తాననిచెప్పి, రూ.7,500లు మాత్రమేఇస్తూ, జగన్ అన్నదాతలను దారుణంగా వంచించాడన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతులసంక్షేమం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని, రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలవడం బాధాకరమన్నారు. ఆక్వా రైతులకు అందాల్సిన సబ్సిడీలను కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి రైతుకి అన్యాయం,నష్టమే మిగిలాయన్నారు.

తన హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎంతమంది రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇన్ పుట్ సబ్సిడీలు, పంటలబీమా సాయం అందించాడో ఆయనే చెప్పాలన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా , సుభిక్షంగా ఉంటుందనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి త్వరగా గ్రహించా లన్నారు. రైతులసమస్యలపై, వ్యవసాయరంగంపై మొద్దునిద్రపోతున్న ముఖ్య మంత్రిని నిద్రలేపి, అన్నదాతలకు న్యాయంజరిగేలా టీడీపీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే స్పష్టంచేశారు.