మోత్కుపల్లి దిగజారి ప్రవర్తిస్తున్నారు: కాట్రగడ్డ ప్రసూన

336

దళిత బంధు కార్యక్రమంపై టీటీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడారు. ఈ పథకాన్ని అమలు చేయటమంటే హుజురాబాద్‌లో ఓట్లను కొనటంగా ఆమె అభివర్ణించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యలను ఖండించారు. చివరి రోజుల్లో దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను అంబేడ్కర్‌‌తో పోల్చటం సిగ్గు చేటన్నారు. తన వ్యాఖ్యలపై మోత్కుపల్లి నరసింహులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. బతుకమ్మ పండుగ పేరుతో మహిళలకు ప్రభుత్వం నాసిరకం చీరలు పంచుతోందన్నారు. గుజరాత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరలు కాకుండా చేనేత చీరలను మాత్రమే మహిళలకు ఇవ్వాలన్నారు. చూపు కోల్పోతున్న నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.