సమర్ధత గల సీఎం జగన్

301

– దేశ ఔన్నత్యం, జాతీయత, సమగ్రత పెరిగేలా ఎపీ.
-నాణ్యమైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు కృషి చేయాలి
-సెమినార్ లో జగన్ పై ఎన్ఈపి ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ ప్రశంసలు.

అమరావతి, జూలై 24: ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రసంసనీయమని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ – 2020 ఛైర్మన్, పద్మవిభూషణ్ డాక్టర్కస్తూరి రంగన్ కొనియాడారు. సమర్థత గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసలు కురిపించారు. సి ఎం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత విద్యావంతుడైన మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాథమిక, ఉన్నత విద్యను సంస్కరించే దిశగా చేపడుతున్న చర్యలు అభినందనీయమని డాక్టర్ రంగన్ వునరుద్ఘాటించారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శనివారం ఉదయం ’21వ శతాబ్ధంలో శక్తివంతమైన సమాజ నిర్మాణం అన్న అంశంపై దృశ్యమాధ్యమ పద్ధతిలో ప్రత్యేక విశిష్ట ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కస్తూరి రంగన్ ముఖ్య అతిధిగా ప్రసంగించారు.

దేశవ్యాప్తంగా విద్యారంగ పురోభివృద్ధికి దోహదపడే పలు అంశాలను ఎన్ఈపీలో పొందుపర్చడం జరిగిందనీ, మల్టీ డిసిప్లేనరీ ఎడ్యుకేషన్ అభివృద్ధిలో భాగంగా విద్యార్థుల్లో నూతన సృజన, విజ్ఞానం, క్రమశిక్షణ పెరిగే మాతన విద్యావిధానాన్ని పరిచయం చేశామన్నారు. జాతీయ విద్యావిధానం అమలు పరిచే దిశలో ఏ పి అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందన్నారు. నిధుల ఖర్చుకు వెనుకాడకుండా పలు పధకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. దేశ ఆర్థిక, సాంఘిక స్థితిగతులు మెరుగయ్యే ఉన్నత విద్య ఎంతో అవసరమని డాక్టర్ కస్తూరిరంగన్పేర్కొన్నారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు సృజన, పరిశోధనలతో కూడిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు పరచాలని సూచించారు. విద్యా బోధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దీని కోసం కృషి చేయాలని కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, త్రీ డీ టెక్నాలజీ, మెషీన్ లెర్నింగ్ కోర్సులను ప్రోత్సహించాలన్నారు. తగరతి గదిలో అత్యంత నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉండాలన్నదే ఎన్టు పీ లక్ష్యంగా డాక్టర్ కస్తూరి రంగన్ పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనా రంగాల్లో ఎమ్వెం యూనివర్సిటీ సాధిస్తోన్న ప్రగతి, కృషి అభినందనీయమన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ ఆచార్య డి నారాయణరావు, అతిథులను ఆహ్వానిస్తూ, యూనివర్సిటీ ప్రగతిని వివరించారు. ఏడాది కాలంలో ఇప్పటికే పది విశిష్ట ప్రసంగాల సెమినార్‌లను నిర్వహించిన ఎస్ఆర్ఎం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణుల విలువైన ప్రసంగాలను పరిశోధనా రంగ నిపుణులకు పరిచయం చేస్తుందన్నారు.రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ….., రాష్ట్రంలో ఏటా రూ.30 వేల కోట్ల బడ్జెట్టును విద్యా రంగానికి కేటాయిస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టి నిరుపేదలకు సైతం ఉన్నత విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మెరుగైన విద్యా ప్రమాణాల సాధన, ఉన్నత ఉపాది అవకాశాల కల్పన దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో మొదటి సారి ఎన్ఈపి మార్గదర్శకాలను అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీగా మంత్రి పేర్కొన్నారు. సమాజంలో పేదరికాన్ని రూపుమాపే దిశగా విద్యావ్యవస్థను ఆదునీకరిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పనితీరును మంత్రి ప్రశంసించారు.

అనంతరం యూనివర్సిటీ వైస్ చాన్నలర్ ప్రొఫెసర్ వీఎస్ రావు మాట్లాడుతూ, ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్ కస్తూరి రంగస్ కు వీసీ వీఎస్ రావు ఆన్లైన పద్దతిలో జ్ఞాపికను ప్రదానం చేశారు. అదేవిధంగా ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య నారాయణరావు మంత్రి ఆదిమూలపు సురేష్ కు ‘స్పేస్ అండ్ బియాండ్ ప్రొఫెషనల్
వాయిస్ ఆఫ్ కస్తూరి రంగన్’ పుస్తకాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మీ సక్సేనా, ఎస్ఆర్ఎం రిజిస్ట్రార్ వినాయక్ కల్లూరి, సీఎ హి పోటీ డాక్టర్ రఘునాథన్, ప్రొఫెసర్లు డాక్టర్ రంజిత్ తాషా, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ పంకజ్ పాఠక్, రవ్వా మహేశ్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, పరిశోధనా రంగ నిపుణులు, పీహెచ్డీ స్కాలర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.