నీటి మునిగిన సంగమేశ్వర ఆలయం

327

కొల్లాపూర్ సమీపాన వేల ఏళ్ళ చరిత్ర ను సంతరించుకున్న సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీటి మునిగే సమయం ఆసన్నమైంది. అల్ప పీడన ద్రోణి కారణంగా గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, ప్రాంతాల్లోని ప్రాజెక్ట్ నుండి తరలి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున కృష్ణా వరద నీరు వచ్చి చేరుతోంది.ఈ క్రమంలో బుద,గురువారం రోజుల్లో వరదలు మరింత ఉదృతం కావడం కారణంగా కొల్లాపూర్ సమీపాన ఉన్న పవిత్ర సంగమేశ్వర స్వామి భక్తులకు చివరి సారి దర్శనమిచ్చి కృష్ణ నదీ గర్భంలోకి మునిగి పోయాడు.కేవలం నాలుగు నెలల పాటు మాత్రమే భక్త జనానికి దర్శనమిచ్చి తిరిగి ఎనిమిది నెలల పాటు నీటి మునిగే సంగమేశ్వర స్వామిని చివరి సారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దేవాళయ పరసరాలో గల సోమశిల నది నీటి మట్టం నిమిష నిముషానికి పెరిగిపోతుండటంతో పూజారులు ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇచ్చి పూజలు నిర్వహించారు.రానురాను వరదనీరు దేవాలయాన్ని ముంచెత్తే సమయం ఆసన్నం కావడంతో పూజా సామాగ్రి తో పాటు వివిద దేవతా మూర్తుల ను తరలించిన పూజారులు గొంతు వరకు నిండిన నీటిలోనే ఉంటూ స్వామికి చివరి సారిగా పూజలందించారు.మరో ఎనిమిది నెలల పాటు సంగమేశ్వర స్వామి దర్శన భాగ్యం భక్తులకు ఉండనందున చివరి సారి సంగమేశ్వర స్వామి దర్శనం పొందిన భక్తులు పరవశించిపోయారు. ఇది ప్రతి ఏటా కనిపించే దృశ్యమే.