మన్మోహన్-మోదీ పాలనలో తేడా ఇదీ..

457

మోదీ భారత ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రూపాయితో డాలర్ విలువ పడిపోతోంది అని రాహుల్ గాంధీ మిగతా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు.
ఒక సారి ఇది చూడండి..ఎవరు ఆర్ధిక వ్యవస్థ చక్కగా నడుపుతున్నారో?
మోడీ అధికారంలోకి వచ్చి 7 సం.లు అయింది కాబట్టి .. ఆ ముందు ఏడు సం.లు మన్మోహన్ గారి పాలనతో బేరీజు వేద్దాం.

2007 లో డాలర్ విలువ ₹41.35 ps ఉంటే అది 2014లో  మన్మోహన్ గారు దిగే సమయానికి ₹62.35ps చేరింది.
అంటే  2007 నుండి 2014 మధ్య
7 సం.లలో డాలర్ తో రూపాయి విలువ  సుమారు ₹21.00  తగ్గిపోయింది..
మరో మాటలో చెప్పాలి అంటే ఒక్క 7 సం.లలో మన రూపాయి విలువ డాలర్ తో  50% కి పైగా కోల్పోయింది.
అప్పుడు ప్రముఖ ఆర్ధిక వేత్త బాగా చదువుకున్న అపర ఆర్ధిక మేధావి మన్మోహన్  ప్రధాని మరియు హార్వార్డ్ లో MBA  చదువుకున్న చిదంబరం  ఆర్ధిక మంత్రిగా వున్నారు..
సరే ! మరి 2014-2021 మధ్య 7 సం.లలో డాలర్ తో రూపాయి విలువ చూడండి.
2014 లో ₹62.35ps ఉంటే ఈ రోజు డాలర్ విలువ ₹73.23 ps ఉంది.
అంటే సుమారు ₹10.88ps మాత్రమే తగ్గింది. అంటే సుమారు 17% మాత్రమే డాలర్ తో రూపాయి విలువ తగ్గింది

అలాగే…
ఫారెన్ ఎక్స్చేంజి నిల్వలు పరిస్థితి చూద్దాం..
మన్మోహన్ పాలనలో 2007లో  దేశంలో ఫారెన్ ఎక్స్చేంజి నిల్వలు $275.30 బిలియన్ డాలర్లు. అంటే ₹20.15.లక్షల కోట్లు
అదే 2014లో ఆయన దిగిపోయే సరికి
$320.60 బిలియన్ డాలర్లు. అంటే ₹23.47 లక్షల కోట్ల రూపాయలు ఉండేవి.
అంటే మోడీ వచ్చేముందు 7 సం.లలో దేశం ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలు $45.30 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగాయి. అంటే ₹3.32లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పెరిగాయి.
మరి ఇప్పుడు మోడీ వచ్చిన 7 సం.లలో  విదేశీ మారక ద్రవ్య నిలువలు ఎలా పెరిగాయో చూడండి.
మన్మోహన్ 2014లో దిగే సరికి ₹320.60 బిలియన్ డాలర్లు. అంటే 23.47 లక్షల. కోట్ల రూపాయలు అని చెప్పుకున్నాం కదా.  మరి 7 సం.ల తరువాత  ఆ నిల్వలు ఈ రోజుకి ₹605.00 బిలియన్ డాలర్లు.
అంటే ₹44.30 లక్షల కోట్ల కు పెరిగాయి.అంటే ఈ 7 సం.లలో $284.40 బిలియన్ డాలర్లు ఫారెన్ ఎక్స్చేంజి నిల్వలు పెరిగాయి. అంటే ₹20.81 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలు పెరిగాయి.

అంటే మన్మోహన్ గారి చివరి 7 సం.ల పాలనలో కేవలం $45.30 బిలియన్ డాలర్లు అంటే ₹3.32 లక్షల కోట్లు పెరిగితే…
మోడీ మొదటి 7 సం.ల పాలనలో $284.40 బిలియన్ డాలర్లు  అంటే ₹20.81 లక్షల కోట్ల రూపాయలు పెరిగాయి.

అలాగే భారత దేశ జిడిపి చూడండి :
GDP
మన్మోహన్ చివరి 7 సం.ల పాలనలో
2007   1238.70 బిలియన్ డాలర్లు
2014   2039.13       ”
పెరిగింది $800.47  బిలియన్ డాలర్లు.

మోడీ మొదటి 7 సం.ల పాలనలో
2014   2039.13  బిలియన్ డాలర్లు
2021   3049.70       ”
పెరిగింది  1010.53     “
ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే పై కాలంలో మోడీ పాలనలో కరోనా వల్ల దేశంలో సుమారు 15 నెలలు పూర్తి ఆర్ధిక కార్యకలాపాలు జరగలేదు. అయినా ఆర్ధిక వ్యవస్థ మంచిపని తీరు కనిపించింది. కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మోడీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ ఏమీ కుదేలు అయిపోలేదు.
2007 లో ప్రపంచంలో 195 దేశాల్లో  భారత్ ఆర్ధిక వ్యవస్థ రాంక్ – 12
అది 2014లో మన్మోహన్ దిగే సమయానికి 10 వ రాంక్ కి పెరిగింది.
అదే 2014 లో ఉన్న 10వ రాంక్ నుండి 2019 మార్చ్ కి మన దేశం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థను దాటుకుని 5వ రాంక్ కి చేరింది. కరోనా వల్ల మళ్ళీ తగ్గి ప్రస్తుతం 6 వ రాంక్ లో ఉంది
ఇప్పుడు భారత్ ని ఏ విదేశీ చదువులు లేని  ఒక చదువు రాని చాయ్ వాలా ప్రధానిగా
విదేశీ చదువులు లేని ఒక సాధారణ మధ్య తరగతి గృహిణి ఆర్ధిక శాఖా మంత్రి గా చేస్తున్నారు.
పై గణాంకాలు పరిశీలించాక ఎవరు బాగా ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నారో తెలుస్తుంది.
విదేశీ మదుపుదారులకు భారత్ ఆర్ధిక వ్యవస్థ మీద బాగా నమ్మకం ఉండబట్టే భారత్ లో వారు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
అయినా విదేశీ చదువులు చదువుకున్న మేధావులు మోడీని , నిర్మల ని విమర్శిస్తున్నారు అంటే కారణం  మాలాగా విదీశీ చదువులు చదివి సర్టిఫికెట్ల కట్ట ఉండి ఢిల్లీలోనూ విదేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఉన్నవారు ప్రధాని పదవిలో,  ఆర్ధిక శాఖ మంత్రి పదవుల్లో కూర్చోవాలి కానీ.. ఆఫ్టర్ అల్ సాధారణ చదువులు చదివి మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన వారు కూర్చుంటారా? అనే పొగరు, అహంభావం వాటి వల్ల కడుపు మంట..
అందుచేత ఎవరైనా మోడీ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడు అంటే గట్టిగా సమాధానం చెప్పండి.DATA SOURCE : BookMyForex.Com
https://www.statista.com/statistics/263771/gross-domestic-product-gdp-in-india/

– చాడా శాస్త్రి