పట్టు‘వదిలిన’ విక్రమార్కుడు… అప్పిరెడ్డి!

445

(జొన్నలగడ్డ రఘునాధ్-9160905464)

లేళ్ల అప్పిరెడ్డి… గుంటూరులో ఆయనపేరు  తెలియనివారెవరూ ఉండరు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో యూత్‌కాంగ్రెస్ ప్రముఖుల్లో ఒకరు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. మాజీ సీఎం దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు ప్రియ శిష్యుడు. నేదురుమల్లి ఆయనను ‘అప్పీ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన గుంటూరు జిల్లాలో ఎప్పుడు పర్యటించినా, పక్కన లేళ్ల తప్పనిసరిగా ఉండేవారు. జగన్ వైసీపీ స్థాపించిన తర్వాత దానిలో చేరి, ఎమ్మల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి నేటి వరకూ జగన్‌కు వీరాభిమానిగానే పనిచేస్తున్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌గా చేసిన అప్పిరెడ్డికి, ఎమ్మెల్సీ పదవి చాలాకాలం నుంచీ ఊరిస్తూవస్తోంది. కానీ కుల సమీకరణ కారణంగా ఇప్పటికి రెండు, మూడుసార్లు మిస్సయిపోయింది. ఒకదశలో మార్కెట్‌యార్డు చైర్మన్ ఇస్తామన్నా.. తనకు ఎమ్మెల్సీ వచ్చేవరకూ వేచిచూస్తానని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత రాజకీయ కేంద్రాన్ని గుంటూరు నుంచి తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసుకు మారిన తర్వాత, ఆయన ప్రస్థానం, దశ మారింది. పార్టీ ఆఫీసు సమన్వయకర్తగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో, అప్పిరెడ్డి ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ పదవి వరించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆ రకంగా.. త్వరలో శాసనమండలిలో ‘అధ్యక్షా’… అనాలన్న తన జీవితకాల వాంఛ తీర్చుకోనున్నారు. దానితో పట్టువదలని విక్రమార్కుడు కాస్తా పట్టువదిలిన విక్రమార్కుడయ్యారు. అప్పిరెడ్డీ..ఆల్ ది బెస్ట్!

లేళ్ల అప్పిరెడ్డి వివరాలు

పేరు     – లేళ్ళ అప్పిరెడ్డి
తండ్రి     – లేళ్ళ సాంబిరెడ్డి
వయసు – 54(26-06-1967)
విద్య     – బికామ్ (బిఎల్)
ఊరు      – అంకిరెడ్డిపాలెం, గుంటూరు రూరల్ మండలం
కుటుంబం – సామాన్య రైతు కుటుంబం

విద్య
ప్రాధమిక విద్య – ఎలిమెంటరీ స్కూల్, అంకిరెడ్డిపాలెం
హైస్కూల్ విద్య – SKBM హైస్కూల్, గుంటూరు
1982-1983లో స్కూల్ పీపుల్ లీడర్‌(SPL)గా ఎన్నిక
ఇంటర్ విద్య – GHR&MCMR జూనియర్ కాలేజ్, గుంటూరు
1983-84(ఇంటర్ ఫస్టియర్)లో జరిగిన కాలేజ్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపు
1984-85(సెకండియర్) కాలేజ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా గెలుపు
డిగ్రీ విద్య – GHR&MCMR డిగ్రీ కాలేజ్, గుంటూరు (1986-89)

విద్యార్ధి-యువజన నేతగా…
1987లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘమైన NSUI  గుంటూరు జిల్లా ట్రెజరర్
1988లో NSUI గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు
1989-1994 వరకు NSUI గుంటూరు జిల్లా అధ్యక్షులు
1994-2001 వరకు యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు
కార్మిక నేతగా…
★దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి స్పూర్తితో  1996లో వ్యవస్థాపక అధ్యక్షునిగా కార్మిక సంక్షేమ జూట్‌మిల్‌ వర్కర్స్‌
యూనియన్‌ (రిజిస్టర్ నెంబర్ 1862/1996) ఏర్పాటు
★2004, 2009 సంవత్సరాలలో ప్రభుత్వ కార్మిక శాఖ నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గెలుపు
★కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇప్పించడంతో పాటు రోగాల బారిన పడిన, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు పరిహారం
అందేలా చూడడం, కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లల వివాహానికి 25వేల రూపాయలు ఇవ్వడం వంటి విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం
★2008లో వ్యవస్థాపక అధ్యక్షుడుగా కార్మిక సంక్షేమ ఆటోవర్కర్స్‌ గుంటూరు జిల్లా యూనియన్‌ (రిజిస్టర్ నెంబర్ 2412/08) ఏర్పాటు
★2010లో మిర్చి యార్డు హమాలీస్ అసోసియేషన్, మిర్చి యార్డు ముఠా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎంపిక
★2010–2011 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు స్వీకరణ
★2011లో హిందూస్తాన్ కోకోకోలా ఎంప్లాయిస్ యూనియన్ (రిజిస్టర్ నెంబర్ c-28/11) గౌరవ అధ్యక్షులుగా ఎంపిక
★2016లో జరిగిన కోకోకోలా గుర్తింపు ఎన్నికల్లో గెలుపు
సేవారంగంలో…
★2015లో వ్యవస్థాపక అధ్యక్షులుగా స్పూర్తి ఫౌండేషన్ ఏర్పాటు
★ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్ధులకు ఉచిత కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు
★ఉచితంగా ఫీజులు, పాఠ్య మరియు నోటు పుస్తకాల పంపిణీ
★వికలాంగులకు ట్రైసైకిళ్ళు, వృద్ధులు, అనాధలకు వితరణ
★గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు, ఉచితంగా మందుల పంపిణీ
★ఏటా విరివిగా రక్తదాన శిబిరాలు
★విద్యార్ధి–యువజనులకు క్రీడా పోటీల నిర్వహణ
సామాజిక రంగంలో…
★2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహ సాధన కమిటి గౌరవ అధ్యక్షులుగా నియామకం
★2019లో విగ్రహ స్థాపన
★2017లో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియామకం
రాజకీయ రంగంలో…
★2003లో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియామకం
★2006లో గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
★2007లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శిగా నియామకం
★2011-2017వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా బాధ్యతలు
★2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ
★2010-14 సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
★2018లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియామకం
★2020లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా… తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం
పర్యవేక్షకులుగా… నియామకం