టెన్త్ తప్పిన మంత్రులు కూడా మాట్లాడటమా? ..హవ్వ!

263

టెన్త్ పాసవ్వని మంత్రులు కూడా పదవ తరగతి పరీక్షలు గురించి మాట్లాడడటం హాస్యాస్పదమమని  టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఎద్దేవా చేశారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులే పరీక్షలు రద్దు చేయాలంటుంటే,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనటం సరికాదని మంతెన సత్యనారాయణరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం పొంచి ఉందని ఓవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. కోవిడ్ ప్రబలుతోంధని లండన్‌లో ఉన్న తన పిల్లలను సీఎం ఇంటికి తీసుకువచ్చారని, రాష్ట్రంలోని విద్యార్థులు మీ పిల్లలాంటివారు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మూర్కత్వం వీడి తక్షణమే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలని మంతెన సత్యనారాయణ రాజు కోరారు.