రేట్లు పెంచవద్దంటే..మరి పథకాలూ వద్దనాల్సిందే!

316

– పెరిగిన పెట్రోల్ డబ్బులు ఎటు పోతున్నాయి?

ప్రతి రోజు… పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మధ్య తరగతి వారి నడ్డి విరిచేస్తున్నారు, ఇదొక కార్పొరేట్ స్కాం, ఆ డబ్బులు ఏమి చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆడి పోసుకునే వారికోసం ఈ విశ్లేషణ!

ముందుగా మన దేశం లో పెట్రోల్ ఉత్పత్తి చేస్తున్న 10 పెద్ద కంపెనీల లిస్ట్ చూద్దాం..
1) IOC (ప్రభుత్వం)
2) ONGC (ప్రభుత్వం)
3) BP (ప్రభుత్వం)
4) Reliance (ప్రైవేట్)
5) ESSAR (ప్రైవేట్)
6) CAIRN (ప్రైవేట్)
7) GAIL (ప్రభుత్వం)
8) HPCL ( ప్రభుత్వం)
9) OIL (ప్రభుత్వం)
10) TATA (ప్రైవేట్)
పైన పేర్కొన్న 10 పెట్రోల్ ఉత్పత్తి సంస్థల్లో, నాలుగు మాత్రమే ప్రైవేట్. మిగితా ఆరు ప్రభుత్వానివి.
ఇక పెట్రోల్ రేట్ల విషయానికి వద్దాం.

ఒక లీటర్ పెట్రోల్ కొరకు:
(రూపాయల్లో)
క్రూడ్ ఆయిల్ ధర : 32.39
ఉత్పత్తి దారుని కమీషన్: 3.60
కేంద్ర ప్రభుత్వ పన్నులు: 32.90
పెట్రోల్ పంప్ కమీషన్ : 3.79
వ్యాట్ పన్ను : 21.81 (30%)
మొత్తం :94.49 రూ:పై
ఈ 94.49 పై లలో దాదాపు 33/- రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మరియు 30/ రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. అంటే దాదాపు సమాన వాటా.
అంటే పెట్రోల్ ఉత్పత్తి కంపెనీలకి వెళ్ళేది ప్రతి లీటర్ కు 3.60/- రూపాయలు కానీ రాష్ట్రానికి లేదా కేంద్రానికి వెళ్ళేది 30/- రూపాయల పైమాటే.

క్లారిటీ
1) అంటే ఇక్కడ ఒక మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి…పెరిగిన పెట్రల్ ధరలు, పెట్రోల్ కంపెనీలకు చేసే లాభం కన్నా 10 రేట్లు ఎక్కువ లాభం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే ప్రజలకు ఉంటుంది అన్నట్లు. ఇది కార్పొరేట్ కోసం కాదు అని మీకు అర్ధం అయ్యి ఉండాలి.
2) ఉన్న 10 పెట్రోల్ ఉత్పత్తి కంపెనీలలో, 6 ప్రభుత్వానివే కాబట్టి అధిక లాభం కూడా ప్రభుత్వ కంపెనీలకే వెళ్తుంది. అంటే  ప్రజలకే వెళ్తుంది.
3) ఇక చాలా ముఖ్యమైనది…ఎంత రేటు పెరిగితె అంత లాభం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తుంది. అంటే ప్రజలకు అని అర్ధం. అంటే ప్రజల దగ్గర తీసుకొని మళ్ళీ ప్రజలకు ఇవ్వడం అని అర్ధం.
4) ఎలా అని ప్రశ్న వచ్చిందా?
దేశంలో మొత్తం 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా టీకా వెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అక్షరాల 40,000 కోట్లు.80 కోట్ల జనాభాకు, దీపావళి వరకు ఉచిత బియ్యం పంపిణీ చెయ్యడానికి కేంద్రానికి అయ్యే ఖర్చు అక్షరాల 1,05,000 కోట్లు.
ఎరువుల సబ్సిడీ 1.5 లక్షల కోట్లు. దేశ రక్షణ బడ్జెట్ 3.5 లక్షల కోట్ల రూపాయలు

మరి ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుండి సమీకరించింది?
1) అప్పు చేసిందా? లేదు
2) బంగారం అమ్మిందా? లేదు
3) దాతలు ఇచ్చినారా? లేదు
4) పన్నుల రూపంలో తీసుకొని మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారా? అవును
పాలకులు మూడు రకాలు..
1)ప్రజల వద్ద పన్నులు రాబట్టి, తమ సొంత విలాసాలకి వాడుకునే వారు.
2)అప్పులు చేసి పూట గడిచేలా చూసే వారు. భవిష్యత్తు గురించి ఎటువంటి ప్లానింగ్ లేని వారు.
3) ప్రజల వద్ద నుండి పన్నులు రాబట్టి, మళ్ళీ అవే డబ్బుల ద్వారా ప్రజా  సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించే వారు.

అభిప్రాయం
పైన పేర్కొన్న మూడు రకాల పాలకులలో, మూడవ పాలకుణ్ణి *ప్రజా సంక్షేమ మరియు ప్రజాతంత్య్ర పాలకుడు అని అంటారు.
కాబట్టి మీకు ఈ విశ్లేషణ ద్వారా అర్థమై ఉంటది… పెరిగిన పెట్రోల్ ధరల ద్వారా వచ్చిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వెచ్చిస్తుంది అని.  అందుకే దీనిని మనము ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అంటున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నది. వచ్చిన ఆదాయం నుండి పెన్షన్లు, సబ్సిడీలు ఇస్తున్నది.పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, దాదాపు అంతే సమానంగా  ట్యాక్స్ ద్వారా ఆధాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు విమర్శించరు ????.. అంతగా ప్రజలపై ప్రేమ ఉంటే రాష్ట్రాలు తమ ట్యాక్స్ ను వదులుకోవచ్చు కదా !!!!!…
ఒకవేళ పెట్రోల్ రేటు పెంచకండి అని మనం అంటే, సంక్షేమ పథకాలు కూడా మాకు వద్దు అనాలి. ఎందుకు అంటే వాటికి డబ్బులు ఎక్కడినుండి వస్తాయి? ఎందుకు అంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ…ప్రజల కొరకు.. ప్రజల చేత…ప్రజల వలన ఉన్న వ్యవస్థ…మనమే దీన్ని నడపాలి…అందుకే నడిపే బండి లో పొసే పెట్రోల్ మీద పన్ను కట్టాలి..