ఢిల్లీలో అగ్నిప్రమాదం

130

దేశ రాజధాని ఢిల్లీలోని లజపతి నగర్ సెంట్రల్ మార్కెట్ లోని షో రూంలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాట్లా హ్యాండ్లూమ్, సంగమ్ శారీ, రేమండ్ రీటెయిల్ వంటి షోరూంలూ మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను ఆర్పేందుకు 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి.70 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధిపతి అతుల్ గార్గ్ చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సిబ్బంది వెతుకుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్టు ఉదయం 10.20 గంటలకు ఫోన్ వచ్చిందని అధికారులు తెలిపారు.