మెరుగైన అభివృద్ధి అందించడమే జ‌గ‌న‌న్న‌ ప్రభుత్వ లక్ష్యం

80

వడ్రంగి కార్మికులకు నూతన భవనాలు ఏర్పాటుకు హామీ
దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
కాల్వ  వెంబ‌డి  గ్రీనరీ అభివృద్ది చేస్తాం- న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్

అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలని,  పేదలకు ఇల్లు కటిస్తాన్ని మాజీ సీఎం చంద్ర‌బాబు  మోసం చేశాడని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు పేర్కొన్నారు.  సీఎం జగన్ పై విమర్శలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.  నగరంలో ప్రజలకు మెరుగైన అభివృద్ధి,సేవలు అందించండంలో భాగంగా శుక్ర‌వారం  నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ. ఎస్‌ తో కలిసి న‌గ‌రంలో పలు ప్రాంతాలు పర్యటించారు.. గడపగడపకు వెళ్లి ప్ర‌జ‌ల‌ను సమస్యలు అడిగి తెల‌సుకుని వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో  బాప్టిస్టు పాలెం 35వ డివిజన్లలో అభివృద్ధి పనులను మంత్రి  పరిశీలించారు. పూర్ణానంద పేట లో ఎప్పటినుంచో నివసిస్తున్న వడ్రంగి కార్మికులకు నూతన భవనాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  35వ డివిజన్ ను మోడల్ డివిజన్ గా  అభివృద్ది చేస్తామ‌న్నారు.

మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చక్కల బజార్ లోని పేద ప్రజలకు నూతన గృహ నిర్మాణం కోసం  ప్ర‌భుత్వానికి  నివేదిక ఇచ్చి, అనుమ‌తులు రాగ‌నే ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు. కాల్వ ప్రక్కన ఉన్న ప్రాంతాన్ని గ్రీనరీ  అభివృద్ది చేస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రాంతంలో  అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు స్థానికులు కోరుతున్న విషయాని 35 డివిజ‌న్‌ కార్పొరేటర్ బాలసాని మణెమ్మ తెలిపిన దానిపై డివిజన్ పరిధిలో అందుబాటులో గల భవనము /  స్థలములను పరిశీలించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా. టి.సురేష్ బాబు, ఉద్యానవన శాఖాధికారి జె.జ్యోతి, వాటర్ సప్లై అధికారులు మరియు బాలసాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.