మమతాకి సుప్రీం కోర్టు ఆదేశాలు

56

సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై మండిపడింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకం. మీరు సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని అమలు చేయాలి’’ అని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.