రంగారెడ్డిలో నేడు షర్మిల పర్యటన

78

నేడు రంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పరిగి నియోజక వర్గం దోమ మండలంలో ఐకేపీ సెంటర్‌ను షర్మిల పరిశీలించనున్నారు. ఈ మధ్యనే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై ధాన్యాన్ని తగ్గులబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు.