రాజ్యాంగంలోని 28, 29, 30 అధికరణాలు మార్చాల్సిందే!

204

(  పరంధామయ్య)

మన రాజ్యాంగంలోని 28, 29, 30 అధికరణాలు తీసివేయడం గానీ, మార్చడం గానీ చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఈ అధికరణాలు హిందువుల పట్ల భరించరాని అమానుషమైన వివక్ష చూపుతోంది. ప్రతి హిందువు ఈ అధికరణాన్ని చదివి అర్థం చేసుకోవలసిన అవసరం వుంది. ఈ అధికరణం హిందువుల కాళ్ళు, చేతులు కట్టేస్తోంది.

ఈ అధికరణాల ప్రకారం….
….మైనారిటీలు చేసినంత యథేచ్ఛగా హిందువులు విద్యా సంస్థలు పెట్టి నడిపేందుకు లేదు. హిందూ విద్యా సంస్థలలో భగవద్గీత, రామాయణం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు లేదు. అదే మైనారిటీలు బైబిలు, ఖురాను వారి విద్యా సంస్థలలో చెప్పొచ్చు.

….హిందూ ధార్మిక సంస్థలపైనా, దేవాలయాల పైనా పెత్తనం ప్రభుత్వానిదే. అదే మైనారిటీల విషయంలో చర్చిల పైనా, మసీదుల పైనా ప్రభుత్వ పెత్తనం చెల్లదు.

….ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద పన్ను వేస్తుంది. మైనారిటీల మత సంస్థలకు, చర్చిలకు, మసీదులకు ఆర్ధిక వనరులు సమకూరుస్తుంది. అదే ఆర్ధిక సహాయం మన వేద సంస్కృత పాఠశాలలకు లేదు.

హిందువులంతా ఏకమై ఈ వివక్షను ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రపంచంలో మెజారిటీ ప్రజలను వివక్షకు గురిచేసి మైనారిటీలకు పట్టంగట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేది మన దేశం మాత్రమే. ఈ దరిద్రమైన ఆంక్షలు పెట్టి హిందువులను నిలువునా దోచుకున్నారు పాలకులు.

ప్రపంచంలో మన దేశమే విచిత్రమైన సెక్యూలర్ దేశం. ఇక్కడ…. ప్రభుత్వ పాఠశాలల్లో ఖురాను, బైబిలు బోధించ వచ్చు. అదే వేదాలు, భగవద్గీత, రామాయణం చెప్పమంటే మత తత్వం అంటారు.  అమర్నాథ్ యాత్రకు పోవాలంటే పన్ను కట్టాలి. మక్కాకు పోయేవాళ్లకు సబ్సిడీ. కలకత్తా యూనివర్సిటీలో ముస్లిములకు ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేకమైన హాస్టళ్లు. హిందువులకు అలాంటి వసతి లేదు.
ముస్లిం అమ్మాయిలకు బోర్డు ఎగ్జామ్ పాసైతే స్కాలర్షిప్. హిందూ అమ్మాయిలకు లేదు.  ప్రాధమిక విద్యలో ముస్లిములు 50% మార్కులు తెచ్చుకుంటే ఆర్ధిక సహాయం. అదే హిందువులు 95% మార్కులు తెచ్చుకున్నా లేదు. ముస్లిములకు వడ్డీ లేని రుణాలు. హిందువులకు లేదు. దేవాలయాల నుంచి వచ్చిన రాబడి ప్రభుత్వానికే. మసీదులు, చర్చిల నుంచి ప్రభుత్వానికి పైసా రాదు.

కుక్కలు, పిల్లుల విషయంలో శ్రద్ధ చూపితే జంతు ప్రేమికుడు. అదే గోమాతల విషయంలో మత ఛాందసం అంటారు. నడి వీధిలో పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాక్స్వాతంత్రం. భారత్ మాతాకు జై అంటే మత ఛాందసం.  MF హుస్సేన్ సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరిస్తే అది గొప్ప కళ, దుర్గా మాతను సెక్స్ వర్కర్ అని కమ్మీలు అంటే సెక్యూలర్. అదే ఇతర మతాలను గెలికి చూడండి. పాస్టర్లకూ, ఇమాములకు జీతాలు. తర తరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న హిందూ అర్చక వర్గానికి అమరావతి కథలలో చెప్పినట్లు తులసీ తాంబూలమే.ఇది మన దేశం! మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి!!