చైనా యాప్స్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన జో బైడెన్‌

57

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టిక్‌టాక్‌, వీచాట్‌ సహా పలు చైనా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. అదే సమయంలో.. సమాచార భద్రత కోసం ‘యూఎస్​ ఇన్​ఫర్మేషన్​ అండ్​ కమ్యూనికేషన్​ టెక్నాలజీ అండ్​ సర్వీసెస్​ సప్లై చైన్’ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సైతం బైడెన్‌ సంతకం చేశారు. టిక్​టాక్​, వీ చాట్​ సహా ఎనిమిది ఇతర సాఫ్ట్​వేర్​లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అధ్యక్షుడు బైడెన్​ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వు (ఈఓ)లపై సంతకం చేశారని వైట్‌హౌస్‌ తెలిపింది.కాగా, అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ టిక్​టాక్​, వీచాట్‌ వంటి చైనా యాప్​లను అమెరికా యాప్​స్టోర్​ నుంచి తొలిగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధించారు.ఈ వారం ప్రారంభంలో 59 చైనా సైనిక, నిఘా సంస్థలు అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది. ట్రంప్‌ హయాంలోనే 44 చైనా కంపెనీలపై నిషేధం విధించారు.