కరోనా వైరస్ కా బాప్.. ‘రెడ్’ వైరస్ హై!

189
ముందో చిన్న కథ చెప్పుకుందాం….!
అనగనగా … !!! రష్యా అనే దేశాన్ని స్టాలిన్ అనే గొప్ప COMRADE పరిపాలించేవాడట .
ఓరోజు ఆ మహాశయుడు,  కొందరు రాజకీయ నాయకులతో ఏదో సమావేశం ఏర్పాడు చేసాడట…! సమావేశమయ్యాక చూస్తే, అతనికి అత్యంత ప్రియమయిన “చుట్ట కాల్చుకునే గొట్టం, PIPE కనిపించలేదట” .వెంటనే తన ముఖ్య అనుచరుడు బెరియా తో…
ఓయ్ బెరియా… నా చుట్ట గొట్టం కనిపించడం లేదు…
So… నువ్వీ సమావేశానికొచ్చిన వాళ్ళందర్నీ విచారించమని ఆదేశించాడట…! ఆ తరువాతి రోజు  స్టాలిన్ కు ఆ గదిలోనే , ఒక మూలన పడి ఉన్న తన చుట్ట గొట్టం కనిపించిందట…! వెంటనే మళ్ళీ బెరియాని పిలిపించి “నా చుట్ట గొట్టం దొరికేసింది. అందువల్ల ఇక ఆ విచారణ అవసరం లేదు” అని సెలవిచ్చాడట…!
దానికి బెరియా…
అయ్యా స్టాలిన్ … ఇప్పుడా చెప్పేది…. ⁉️  చాలా ఆలస్యమైంది…
“ఇప్పటికే సగం మంది ఆ చుట్ట గొట్టం తామే దొంగతనం చేసామని ఒప్పేసుకున్నారు … ఒప్పుకోని మిగతా సగం మంది చచ్చి శవమై పోయారు”. అని బదులిచ్చాడట…!
ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రజాదారణ పొందిన ఈ పిట్టకథ చాలా మందికి తెలిసే ఉంటుంది… కొంతమందికి ఇది ఒక జోకులా నవ్వుకోవడానికి చెప్తే, ఇంకొందరు”Communism in a Nutshell” అని చెప్పడానికి ఇదే కథ చెప్తారు.
 ఈ కథలో నీతి ఏంటంటే…⁉️,
అధికారంలో ఉన్నోడేదన్నా శాసిస్తే మర్యాదగా ఒప్పుకో …
లేదంటే చావే కొనితెచ్చుకో ….
ఇక సామాన్య ప్రజలకోసం పనిచేసేదే కమ్యూనిజం అని ఎవడన్నాడో గానీ…, వాడిని చక్కిలిగింతలు పెట్టి చెంపలు పగులగొట్టాలి…
ఎందుకంటే…,
చరిత్రలో ఏ కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్నా మనం చూసేది
“కష్టాలు౼ కన్నీళ్లూ ౼ ఒక నియంత” అనే ట్రాజెడీ సినిమానే.!
ఆ కష్టాలు కన్నీళ్లు ఎవరో శత్రుదేశాల వాళ్ళవనుకునేరు ..కానే కాదు…, వారి సొంత దేశ ప్రజలవే సుమా !!
ముందుగా విప్లవం రావడానికి రక్తం ఏరులై పారితే…,విప్లవం తర్వాత, వచ్చిన అధికారం నిలుపుకోవడానికి మళ్ళీ దేశం రక్తసంద్రం అవుతుంది….
చెప్పుకోడానికే ప్రజల ప్రభుత్వం. కానీ, ప్రజలకేం కావాలో చెప్పే హక్కు అస్సలు ఉండదు. Top Level ల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం….
కాదని వాదిస్తే శిరచ్ఛేధమే …
కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట్లల్లా … రష్యా, చైనా, ఉ. కొరియా, తూ.జర్మనీ,… ఎక్కడయినా సరే… అక్కడ తిండికి రేషన్, బట్టలకి రేషన్, ఇంటికి రేషన్, ఆఖరికి మాట్లాడటానికి కూడా రేషనే సుమా!
అక్కడెవరికీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, జీవితంలో ఎదగాలన్న కోరిక, బాగా కష్టపడితే మంచి జీవితం వస్తుందన్న ఆశ ఏమీ ఉండవు. ఆఖరికి ప్రజల జీవితానికి అర్థం పరమార్థం ఏమీ లేదు.
ఫ్యాక్టరీలలో యంత్రాల్లాంటి జీవితం. నిజం…
మరీ… యంత్రాల్లాంటి జీవితం అంటున్నానని అతిశయోక్తి అనుకోవద్దు. వాళ్ళ ఫిలాసఫే “From Each, According to his Ability, to Each According to his Need.” ఉదాహరణకి మీదగ్గర ఒక కారు (యంత్రం) ఉందనుకోండి. మీరు ఏం చేస్తారు.. ఎంత వీలయితే అంత తక్కువ పెట్రోల్ పోసి ఎంత వీలయితే అంత ఎక్కువ దూరం తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా అదే ఫిలాసఫీ …
విచిత్రమేమంటే…⁉️
వీళ్ళింత నరమేధం సృష్టించినా…,Roads పక్కనుండే పంటపొలాలే పచ్చగా ఉండేవట Remote Area పంటలన్నీ ఎండిపోయేవట …
కారణం,. రైతులు పనిచేస్తున్నారా లేదా అని Roads వెంట సైనికులు తిరిగేవారట …!
ఇష్టంలేని పనులు కష్టపెట్టి భయపెట్టి ఎన్నిరోజులు చేయించుకుంటారు చెప్పండీ…
కొన్నేళ్ళకే దిగుబడి మొత్తం ఢమాల్ … ఒకవేళ, ఎంతో కొంత దిగుబడి వచ్చినా Quality మాత్రం Complete Nill …పారిశ్రామికరంగ సంగతీ ఇంతే … ఆహారకొరత ఆకలిచావులు,… ఆకాశాన్నంటాయి …
( ఇవన్నీ 1989 లో రష్యాలో Communism కుప్పకూలిన తర్వాతే CPI, Politbuero సభ్యుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు స్వయంగా ఒప్పుకున్నవే సుమా …  నా సొంత వాక్యాలైతే కావు )
ఆ మహానుభావుడు కూడా రష్యాలో జరుగుతున్న నేరాలూ ఘోరాలు మాకు 15 yrs ముందే ప్రత్యక్షంగా చూసాము …కాకపోతే, బయట పెడితే ఇక్కడున్న కమ్యూనిష్టు పార్టీలు ఇంకా ఆగమైపోతయేమోనని, ఇంతకాలం చెప్పలేదని కూడా చెప్పిండు తెల్సా ?! పాపం పదిహేనేళ్ళ పాటు పాపాన్ని దాచలేక ఎంతగా కుమిలిపోయారో కదా కరోనా కామ్రేడ్స్ …
ఇక కమ్యూనిస్టులకి ఇంకో ముఖ్య Idealogy ఉంది. సంఘంలో ఏ క్లాస్లూ ఉండకూడదు.
ఆడ, మగ, ధనిక, పేద, మతం, కులం ఏమీ ఉండకూడదు..
అంతవరకు బాగానేవుంది…
కానీ…,
ఒకవేళ ఉహూ… నాకు దేవుడి మీద నమ్మకం ఉందని ఎవరన్నా అంటే…!సరాసరి ఆ దేవుడి దగ్గరకే చేరతారు. రష్యాలో కూలిన చర్చిలు, దేవుడిని నమ్మిన వారి రక్తంతో తడిసిన నేల చెప్తాయి వీరి కిరాతకాలు.
అసలు సింపుల్ గా చెప్పాలంటే.. ఎక్కడ కమ్యూనిజం ఉంటుందో ఆ రాజ్యం రక్తసిక్తం.. హింస, ప్రతీకారం, రాజకీయ హత్యలు, రక్తం ఏరులై పారడం అన్నది అక్కడ సర్వసాధారణం…  ఆ రక్తం ఎవరిదీ అంటే …⁉️
అది కూడా సామాన్య ప్రజలదే సుమా ! ఆశ్చర్యంగా ఉందా…?
సరే… ఇది చూద్దాం.
తమ సొంత దేశ ప్రజలనే అత్యంత కిరాతకంగా చంపిన నరహంతకుల జాబితా ఒకటి రూపొందిస్తే,  ఏ నియంత పేరు మొదట ఉంటుందో చెప్పండి…?
HITLER అని చెప్పినవాళ్ళంతా Corona చైనాను Copy కొట్టినట్లే… అత్యంత క్రూరుడు అని మనం చెప్పుకుంటున్న HITLER Gas Chambers & Concentration Camp ల్లో పెట్టి చంపింది  అరవై లక్షల మందిని….. అయ్యబాబోయ్ అనుకుంటున్నారా….
మరి మన Communalist ల ఖతర్నాక్ COMRADE, STALIN దొర Just, రెండు కోట్లమందినే పొట్టన పెట్టుకున్నాడట….!
బాబోయ్…  వీడూ ఒక మనిషేనా అని ఆశ్చర్య పోతున్నారా…!
నరహంతకుడు, క్రూరుడు, నరరూప రాక్షసుడు అని తిట్టేసుకుంటున్నారా…
ఆగండాగండి… ఇతనికి బాబు లాంటి వాడింకొకడున్నాడు.. అతడు చంపించింది అంతకు రెండురెట్లట సుమా ….
అతడే మన RedVIRUS ల ఆరాధ్యదైవం మావో జెడాంగ్ …
అప్పట్లో యాభై నుండి డెబ్భై కోట్లమంది ఉన్న చైనా ప్రజల్లో సుమారు ఐదు కోట్లమంది అత్యంతక్రూరంగా చంపబడ్డారంటే …! ఊహించుకుంటేనే …, వీళ్ళంటే భయం జుగుత్స కలుగతాయి …
ఏ చరిత్ర చూసినా నియంతలనగానే HITLER,  MUSSOLINI,… ల పేర్లే ఉంటాయి గానీ ఈ ఘోర నరహంతకుల పేరెక్కడైనా చూసారా …⁉️⁉️ ఉండవు… ఎందుకంటే…!
( చరిత్ర రచన చేజిక్కించుకొని ఈ వీరులు చేతివాటం ప్రదర్శించిందే ఇందుకని అర్థమైందనుకుంటా )
ఇప్పడుకూడా CORONA భూతాన్ని సృష్టించి, ఈ పిశాచాలు ప్రంపంచ మానవాళిపై ఎలా విరుచుకుపడ్డారో చూస్తూనే ఉన్నాం …ఇదండీ మన కమ్యూనలిస్టుల ఘనచరిత్ర ….
ఇక చంపడం ఒక్కటే కాదు…,  ప్రత్యర్థుల మీద వీరు ప్రయోగించే అత్యంత కిరాతకమయిన హింసాత్మక పద్ధతులు తెలుసుకుంటే మనం రెండు రోజులపాటు అన్నం కూడా తినమంటే నమ్మండీ…
ఇక మన దేశంలో…….
అధికారమున్న చోట్లల్లా రక్తం రుచి మరిగిన తోడేళ్ళలా చేలరేగే ఈ ఎర్రపిశాచాలు ఎన్నికలప్పటికి ఎవరు నెగ్గుతారనుకుంటే వారి పంచన చేరి ఆ పార్టీ వాళ్ళు వేసిన ఎంగిలి సీట్లు తీసుకుని పోటీ చేస్తారు…
ఉదా: మనరాష్ట్రాన్నే తీసుకుంటే…
ఒక ఎలక్షన్లో బషీర్ బాగ్ కాల్పులు అని TDP ని వ్యతిరేకించి కాంగ్రెస్ పక్షాన చేరితే…, ఆ తరువాత ఎలెక్షన్లో ముదిగొండ కాల్పులని చూపించి అదే TDP పంచన చేరతారన్నమాట… ఆ తరువాత ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకరి పక్కన…
వీళ్ళగురించి పక్కా అవకాశవాదులు, ఊసరవెల్లులు ఇలా ఎన్నిచెప్పుకున్నా తక్కువే….
ఎలాగూ ఒంటరిగా వెళితే ఆ 2% ఓట్లు కూడా రావు కాబట్టి, ఎలాగో నెట్టుకురావాలి కాబట్టి…,
వాళ్ళ పంచనో వీళ్ళ పంచనో చేరి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తోడై… కొంచెమైనా పరువు దక్కకపోతుందా అన్నదే వాళ్ళ ఆశ….
మొన్న బెంగాల్లో అలా కూడా ఓట్లురాలకపోయేసరికి,ఇప్పుడో కొత్త Trend అందుకున్నారు
మమతాబెనర్జీ మమ్మల్ని లేవలేకుండా తంతేతన్నింది గానీ …, BJP ని ఓడించింది కాబట్టి, “మమతాబెనర్జే మాకు అసలైన Energy అనే కొత్తపల్లవి అందుకున్నారు ఈ మమతేలేని మూర్కిష్టులు”
ఇక Bengal, Tripura ల్లో బొక్కాబోర్లా పడి మూతిపండ్లు రాలగొట్టుకున్న మూర్కస్టులు Kerala ను చూసి తెగ మురిసిపోతున్నారనుకో …
అక్కడ కూడా COVID కష్టకాలంలో బాగా కష్టించి సమర్ధవంతంగా పనిచేసిన ఆరోగ్యశాఖామంత్రి . K.K.Shailaja గారిని ప్రోత్సహించాల్సిందిపోయి ఎక్కడ పోటీగా తయారవుతుందోననే అనుమానంతో అవమానకరంగా ఆమెను Cabinet స్థాయినుండి Demote చేసిన వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడ్డం వింతల్లో వింత …
ఇదేవిధంగా…,
తమ CM కుర్చీకి ఎక్కడ పోటీపడుతుందనే భయంతో ఇంతకుముందు KR.గౌరిఅమ్మన్ ను కూడా అవమానించి పార్టీనుంచి వెళ్ళగొట్టిన విషయం తెలియందెవరికి …?
అదే వీళ్ళు బూర్జువా భూస్వామ్య, మతోన్మాద నియంతృత్వ అని నోటికొచ్చినట్లు రోజూ తిట్టే BJP మాత్రం,  ఆరోగ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిన HEMANTHA BISWA SHARMA ని,  అస్సోం ముఖ్యమంత్రిగా Promote చేయడాన్నిబట్టి చూస్తే…,
ఇందులో అసలు బూర్జువా ఎవరో…? అసలైన భూస్వామ్య నియంతృత్వ లక్షణాలు ఎవరివో సులభంగానే తెలుసుకోవచ్చు …
వీళ్ళ Politbeuro లో ఇప్పటివరకూ దళితులు, మహిళల ప్రాతినిధ్యం చెప్పుకుంటే  సిగ్గుపోయేంత తక్కువగా ఉంది…
కానీ …, నోరుతెరిస్తే …!  పీడిత తాడిత దళిత బడుగు బలహీన వర్గాలు అంటూ ఊతపదాలతో ఊదరగొట్టేస్తుంటారు …
ప్రపంచ చరిత్రలో ఏ కమ్యూనిస్టు పోరాటమూ హింస లేకుండా జరగలేదు.
హింస వీరి ఆయుధం … హింసే వీరిఆయుధం…
ఎమర్జెన్సీ సమయంలో ఎదురు మాట్లాడిన వాడినిజైల్లో పెట్టి స్వతంత్ర భారత దేశానికి చీకటి రోజులుచూపించిన ఖాన్ గ్రేస్ అంటే…., ఈ కమ్యూనలిస్టులకు ఎంత ప్రేమో.?
భారతీయుల్లో కుల,మత, వర్గ,ప్రాంతీయ తత్వాలు తగ్గి అందరూ భారతీయులుగానే సమైక్యంగా సాగిపోతే …,
వామ్మో వామ్మో … ఇంకేమైనా ఉందా… 🥱🥱🥱  ఇక ఈ ఎర్రోళ్ళకు దిక్కేది…⁉️
వీళ్ళకు పూటెట్ల గడువాలి?
అసలు కులం మతం పేరుతో సమస్యలులేకపోతే  ఈ కమ్యూనలిస్ట్ లకు మనుగడే లేదు… అందుకే…,
ఖాన్ గ్రేస్ తో కుమ్మక్కై చరిత్రకారులుగా అవతారమెత్తి మొత్తం భారతీయ సంస్కృతిని చరిత్రను వక్రీకరించి…, మొగలాయిల చరిత్రే మొత్తం భారతీయుల చరిత్రగా చిత్రీకరిస్తూ …, ఆధారేవీలేకున్నా,  ఆర్యధ్రావిడ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి.. ఉత్తర దక్షిణ భారతాలమధ్య లేనిపోని చిచ్చుపెట్టే నీఛమైన పనికిపూనుకున్నారీ మూర్కిష్టులు …
“గుజరాత్ మారణకాండ నరేంద్ర మోడే ప్రోత్సాహించాడన్నది పచ్చి నిజం” ఇది ఒక ఎర్రాయన తీర్పు …
(ఇప్పటివరకూ ఏ న్యాయస్థానమూ ఇవ్వని తీర్పు వీళ్ళే ఇచ్చేస్తుంటారు).

కానీ…,
“When a Big Tree falls, the Earth Shakes” అంటూ తన తల్లి చస్తే, కనీసం మూడువేల సిక్కులనైనా చంపొద్దా ..అంటూ బహిరంగంగానే నోరుపారేసుకున్న రాజీవుడి పంచనే చేరిన మూర్కజీవులు కూడా మానవహక్కుల గురించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా  …⁉️
అంటే,
ఎమర్జెన్సీని, సిక్కుల ఊచకోతని కొనసాగించిన ఖాన్ గ్రేస్ కు వీళ్ళు తోక పార్టీగా మారొచ్చు. తప్పులేదట…!వీళ్ళు చేసేటివన్నీ ప్రగతిశీలాలేనట!
హిందువులు సిక్కులు, బౌద్దులు, పారశీకులు, జైనులు, ఆఖరికి హిందూధర్మంలోని దళితులపై విదేశీ ఎడారి జాతుల దౌర్జన్యం జరిగిన వేలాది సంఘటనల్లో ఒక్కటైనా వీళ్ళు ఖండిస్తారేమోనని గత 50yrs నుండీ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నాము …
నాకు ఒక్కటంటే ఒక్క సంఘటన దొరకలేదింతవరకు కూడా …
అందుకే, రోజురోజుకూ అంతర్థానమౌతూ Microscope తో చూస్తేగానీ కనిపించని Bacteria కంటేగూడా చిన్నదైన RedVIRUS గా Mutation చెందారీ కమ్యూనలిస్టులు …
నిజంగానే దేశంలో 1% కూడాలేని ఈ RedVIRUS గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరముందా …⁉️ అని అప్పుడప్పుడు కొందరంటూంటారు …
కానీ…,
ఈ RedVIRUS, Corona కంటే మహాభయంకరమైనది …ఎందుకంటే…, Corona Virus పుట్టుక & వ్యాప్తికి కారణమే ఈ RedVIRUS.
CoronaVIRUS కేవలం, ఆరోగ్యాపరంగా ఆర్థికపరంగానే నష్టం చేస్తుందేమో…
కానీ…, ఈ RedVIRUS యువకులను, అంతోఇంతో ఆలోచించే వాళ్ళ మనసుల్ని అయోమయానికి గురిచేసి ఆలోచించనీయకుండా చేసి అనేక భ్రమలకు గురిచేస్తుంది.
ఉదా::
ఈదేశంలో గత వందేళ్ల నుండి మనుషులను తెల్లగా నిగనిగలాడేటట్లు చేస్తున్నామంటూ మోసపు Advertisements తో లక్షలకోట్లు కొల్లగొడుతున్న విదేశీ Hindustan Lever Ltd అనే సంస్థపై ఇప్పటివరకు పల్లెత్తుమాట కూడా అనని వీళ్ళు, ఆ కంపెనీల మోసాన్ని భయటపెడ్తూ …, స్వదేశీ భావనతో స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ తో ముందుకొచ్చిన బాబా రాందేవ్ గారిపై దుమ్మెత్తి పోయని రోజులేదంటే నమ్మండీ ..
అదేవిధంగా…,
ఇప్పటివరకూ వేలాది విదేశీ బహుళజాతి కంపెనీల దోపిడీలపై నోరుమెదపని వీళ్ళు …,
టాటా, అంబానీ, ఆదానీ లపై నోరుపారేసుకోని రోజు లేదని అందరికీ తెలిసిందే కదా …
వాస్తవానికి…
TATA, Reliance లు Enter కాకముందు Cell Phone Tariff లు ఎంత ఎక్కువగా ఉండేవో … వీరి Entry తో Cell Rates ఎంత గణనీయంగా తగ్గిపోయాయో … ఈ ఎర్రివైరస్ కు తప్ప అందరికీ తెలుసు )
అందుకే …,ఈ కరోనాకమ్యూనిస్టు VIRUS తో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందిగా భారతీయ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాము …

ప్రపంచ చరిత్రలో నరమేధం సృష్టించి కోట్ల మందిని చంపిన ఈ క్రూర నరహంతక కమ్యూనలిస్టులు అహింస, ప్రజల హక్కుల గురించి మాట్లాడితే మనిషన్న ప్రతీవారు ముక్కున వేలేసుకోవాల్సిందే …
ఒక్క కమ్యూనిస్టు దేశమైనా బాగుపడిందేమో చూపించండనగానే …,
ఉందిగా అని… 30yrs క్రితమే పచ్చి పెట్టుబడిదారుగా మారిన చైనాను ఇంకా చూపిస్తూనే ఉంటారు …
( ఎప్పటికప్పుడు Update ఐతేకదా Latest విషయాలు తెలిసేది )
అలాగే శతాబ్దం క్రితం నాటి Note Book సిద్ధాంతాలని, ఇప్పటికీ “మక్కీకి మక్కీ తేరానామ్ లిక్కి” గా అనుసరిస్తూ మూర్ఖంగా వాదించే పిడివాదులే అత్యధికంగా ఉన్నారు….,
మరింత దురదృష్టమేమంటే…,వారంతా మనదేశంలోనే మరీ ఎక్కువగా ఉన్నారు.
“మూలానికి మందెయ్యకుంటే తాళం చేసేదేముంది ౼ RedVIRUS, DeadVIRUS కానిదే CORONA కైసే ఖతం హోగా” …⁉️