నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పని వేళలు

61

తెలంగాణాలో నేటి నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే.