ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ

51

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖలోని వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌‌ను కూల్చివేయడంపై ఆయన లేఖ రాశారు. వైస్సార్సీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైనదన్నారు. లాభాపేక్షలేని వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌‌ను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం విచారకరమని తెలిపారు.ప్రస్తుతం ఇది సుమారు 190 మంది విద్యార్థులతో నడుస్తోందన్నారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన వారేని ఆయన చెప్పారు. పాఠశాలకు ఎటువంటి వ్రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా సహజ న్యాయం సూత్రాలకు వ్యతిరేకంగా కూల్చివేత జరిగిందని మండిపడ్డారు. నాగరిక సమాజంలో ఇటువంటి దారుణమైన చర్యకు అనుమతించడం సిగ్గుచేటన్నారు. మనలాంటి ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించే దేశంలో ఇటువంటి చర్యల వల్ల కలిగే ఆవేదన మాటల్లో వ్యక్తపరచలేమని అన్నారు.