నవనీత్ కౌర్‌ కులం సర్టిఫికెట్ రద్దు

207

ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆమె ఎస్సీ కులం సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని శివసేన నేత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె ఇచ్చిన కులం సర్టిఫికేట్ ఫేక్ అని తేల్చింది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. అమ్రావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఎంపీ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. అయితే నవనీత్ కౌర్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలుగులో మహారధి, యమదొంగ, రణం, జగపతితో పాటు పలు సినిమాల్లోనూ నటించారు.