ఈటల 50 వేల ఓట్లతో గెలిచేస్తాడు:జీవన్‌రెడ్డి

103

ఇండిపెండెంట్‌గా ఈటల నిలబడితే 50 వేల ఓట్లతో గెలిచేవారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..   ఈటల బీజేపీలో చేరడం వల్ల బలహీన పడ్డారని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతానని తన వ్యక్తిత్వాని తగ్గించుకున్నారన్నారు.  కాంగ్రెస్‌లో చేరడం చేరకపోవడం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇష్టమన్నారు. టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందన్నారు. అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు  ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు 90 శాతం మంది దళితులే, వారిని తొలగించడం మానవత్వం లేని అమానవీయా చర్య అని జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉపాధి హామీ కూలీలడబ్బులు 2 నెలల నుంచి చెల్లించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు.