స్వరార్ణవము

426

సరస్వతీదేవి చేతిలో కనిపించే ఆ పుస్తకాలను స్వరార్ణవములు అంటారు. వాటి అనుగ్రహం కలిగిన వారు కేవలం నలుగురు మాత్రమే.. వారు శ్రీ ఆంజనేయస్వామి వారు, భద్రాచల రామదాసు వారు, తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, త్యాగరాజస్వామి వారు అని మనకీ విదితం.

ఆ స్వరార్ణవములు చివరిసారి అందుకున్నవారు త్యాగరాజస్వామి వారు. దేవఋషి అయిన “నారదుడు” స్వయంగా సంగీతంలోని రహస్యాలను చెప్పి, స్వరార్ణవము ఇచ్చినట్లు, ఆ సందర్భంలోనే “సాధించెనే మనసా” అనే పంచ రత్న మాలిక లోని మూడవ కృతి చేసినట్లు ప్రాచుర్యంలో ఉన్నది. త్యాగయ్య కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్టానం, అని నాలుగు విధాలుగా గుర్తించారు. నారద అనుగ్రహ ఫలితంగానే అనేక విషయాలు గ్రహించి, 24వేల రచనలు, 800 కీర్తనలు గావించారు త్యాగరాజస్వామి వారు. మంత్రోపదేశం తో “స్వర్ణార్ణవం, నారదీయం” అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథ రచనలు గావించారు.

అయితే ఇప్పుడు ఆ సరస్వతీదేవి ప్రసాదిత స్వరరాజము స్వరార్ణవము ఎక్కడ ఉన్నది అని అనేక మంది పరిశోధనలు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ వస్తున్న సందర్భములో, చాలా విచిత్రముగా వీటి ఆచూకీ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. ఆ సరస్వతి దేవి గ్రంధరాజము ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియం లో వున్నట్టు ఆధారం దొరికింది అని సమాచారం. అవి మ్యూజియం డిస్ప్లేలో గాకుండా అత్యంత అరుదైన ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్రపరిచినట్టు తెలుస్తుంది.

స్వరార్ణవముల యొక్క విశిష్టత ఏమిటంటే అవి పూర్తిగా దైవగ్రంధములు.. అమ్మవారే స్వయముగా తన చేతితో రాసిన మహిమాన్విత గ్రంధరాజము. అంతే కాదు, స్వరార్ణవముతో పాటు కనిపించే ఆ రెండవ పుస్తకం మహతి.