స్వయం సహాయక సంఘాలు రికార్డు స్థాయిలో నిధులు:సబితా

100

స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రికార్డ్ స్థాయి లో నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికె దక్కుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. రాష్ట్రం లోని మహిళా సంఘాల సభ్యులు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిస్తున్న రాష్టం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.

నాణ్యమైన నిత్యావసరాలను అందించడంతో పాటు సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతీ గ్రామంలో వివిధ రకాలైన ఐదేసి తెలంగాణ ఎస్ఎచ్ జి స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నామని ర మంత్రి  వెల్లడించారు. జిల్లాలో దాదాపు 3,172 తెలంగాణ ఎస్ఎచ్ జి స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా దాదాపు రూ.33 కోట్ల ఆర్ధిక సహయాన్ని బ్యాంకుల ద్వారా అందించబోతున్నామని మంత్రి తెలిపారు. వీటిని ఈ నెల 15వ తేదీ నుండి ఆగస్టు 15 తేదీలోగా అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. వీటి ఏర్పాటు విషయంలో స్థానిక శాసన సభ్యుల , ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని మంత్రి కోరారు. సోమవారం నాడు తన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మరియు సెర్ప్ పనితీరును సమీక్షించారు. వీటి ద్వారా మహిళలకు సుస్థిర జీవనోపాధితో పాటు, ఆదాయాభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. యాంత్రిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి గాను అవసరమైన పనిముట్లను సమకూర్చుకోవడానికి రైతు సేవా కేంద్రాలు ఇప్పటికే యాచారం,నేదునూర్ లలో ఏర్పాటు చేశామని,త్వరలో కేశం పేట,మాడ్గుల,చేవెళ్ల లో ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు గత సంవత్సరం 480 కోట్ల రుణాలు అందజేయగా,ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 700 కోట్ల రూపాయలను రుణాలుగా అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుగనుగుణంగా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు రుణాలిచ్చే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

భవిష్యత్లో రైతులు పండించే పంటలను కొనుగోలు చేసి, లాభాలను ఆర్జించే విధంగా మండల స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసి, బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరంలో 22,292 మంది మహిళలతో నూతనంగా 2,260 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సంఘాలకు ప్రస్తుత సంవత్సరంలో రుణాలను అందించే ప్రక్రియను చేపట్టాలని మంత్రి. సూచించారు. జిల్లాలోని గిరిజన రైతుల పంటపొలాల్లో బోర్లు వేసేందుకు, పంటపొలాలను అభివృద్ధి వేసేందుకు ఎన్ని నిధులకైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్హులైన గిరిజనులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, అదనపు వీడి జంగారెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు.