మరో బాలుడికి సోనూ ప్రాణ దానం

229

తిరువూరు-తెలంగాణలోని భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,రాజాపురం గ్రామానికి చెందిన గౌరవరపు భాస్కరరావు, సత్య దంపతులకి తేజ్ కృష్ణ అనే ఏడాది వయసున్న బాలుడు ఉన్నాడు.గత కొంతకాలంగా ఈ బాబు గుండె సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యులు సర్జరీ అవసరం అన్నారు.వీరిది పేద కుటుంబం. బాబు తండ్రి ఆటో తోలుకుంటూ కుటుంబాన్నిపోషిస్తున్నాడు.జనవిజ్ఞానవేదిక (తిరువూరు)ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకెళ్ళారు.సోనూసూద్  సహకారంతో  బాబుకి 3లక్షల వ్యయంతో ముంబాయిలోని ఎస్.అర్.సి.సి పిల్లల ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ జరిగింది.బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.బాబు ఆపరేషన్ కి సహకరించిన సోనూసూద్ కి జేవివి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.