జగన్ రెండేళ్ల పాలన మేడిపండు సామెత లాంటిది

159

గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు  అయిందని పెద్దపెద్ద పుస్తకాలు అచ్చులు వేసుకొని బాజాలు మోగించుకుంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం సాదించారో ఆలొచించుకోవాలని గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్ అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంజి చిరంజీవి తో కలసి  జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో శ్రావణ్ మాట్లాడుతూ జగన్ పుస్తకం  మేడిపండు సామెతగా ఉందని ఎద్దేవాచేశారు. ఇచ్చిన హామీలను 80శాతం పూర్తి  చేశామని డప్పులు కొట్టుకుంటున్నారని, పించన్ ల విషయం లో పేదలు, వృద్దలు, వితంతువులను మోసం చేశారని .  ఎస్సి, ఎస్టీ, బిసిలకు 45సం. దాటినవారికి పెంక్షన్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు.  జగనన్న విద్యా దీవెన పేరుతో అన్నీరకాల విద్యార్ద్యులను మోసం చేశారు.పెరిగిన ధరలకు అనుకూలంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వహయాంలో భీమా పథకాలలోఉన్న వారు ఎవరైనా చనిపోతే డబ్బులు వెంటనే చెల్లించారు. ఇప్పుడు అదికూడా లేకుండా చేశారు.ఇప్పటివరకు జిల్లాలో సహజమారణలు, ఆకస్మికమరణలు పొందిన వారికి ఇప్పటివరకు భీమా చెల్లించలేదు. ఇతర దేశాలకు చదువుల కోసం వెళ్లిన బడుగు బలహీన వర్గాలువారికి ఇంతవరకుడబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నరు.సంక్షేమాలను కుదించి ప్రజలకు మేడిపండుసామెతగా చేస్తున్నారని ఆరోపించారు. సమాజాన్ని కులాల వారిగా ముక్కలు ముక్కలుగా చేసి విడగొట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.