జగన్ ఉత్తరం పక్కదారి పట్టించడమే!

99
 – నాగోతు రమేశ్ నాయుడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి 
వాక్సిన్లపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు రాయడం,  సమస్యను పక్కదారిమళ్లించడమేనని బీజేపీ ఏపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు. వాక్సిన్ల పంపిణీలో తన ప్రభుత్వ వైఫల్యం, అసమర్థతను జనం దృష్టి మళ్లించేందుకే జగన్ లేఖ రాశారని వ్యాఖ్యానించారు. ఆయనకు పక్కదారిలో అందే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్నారు. గతంలో కేంద్రం ఏపీకి ఎక్కువగా  వ్యాక్సిన్లు ఇస్తోందన్న మంత్రుల మాటలు నాగోతు గుర్తు చేశారు.

కర్ణాటక , UP , ఢిల్లీ , ఒడిశా లాంటి రాష్ట్రాల బిడ్ లు కు వ్యాక్సినేషన్ సంస్థలు ముందుకు వచ్చాయి , కాని AP కి ఎందుకు రాలేదో వాస్తవాలు చెప్పాలి. 20 వ తేదీ pre bid నందు సంస్థలు ముందుకు రాకపోతే , కారణం తెలుసుకొని దాని విది విధానాలు సమీక్ష చేసుకోవాలన్న ద్యాస ప్రభుత్వానికి లేదు. పక్క రాష్ట్రాలు ( fizer , sputnik మొదలగు )  వ్యాక్సిన్ ప్రతినిధులు కోరికమేరకు రాయతీలు , వ్యాక్సినేషన్ పక్రియ లో లోపాల బాధ్యత ప్రభుత్వం వహించేలా , వాటి శీతలీకరణ నిల్వ కేంద్రాలు బాధ్యత రాష్ట్రమే వహించేలా మార్చుకొన్నారు.  ఆదాయాలు వచ్చే మద్యం , ఇసుక లాంటి వాటిమీద వున్న సమీక్షలు వ్యాక్సినేషన్ మీద చెయ్యలేదు. అధికారులకు స్వేచ్ఛలేదు ,మంత్రులకు నాయకులకు బాధ్యత లేదు. సమాఖ్య వ్యవస్థలో మిగతా రాష్ట్రాలను పోగేసి కేంద్రం మీదికి పురిగొల్పాలనుకోవడం సరియైనది కాద.చివరకు డ్రిప్ , వ్యవసాయ పనిముట్లు కూడా 2 సంవత్సరాలుగా రైతులకు అందడం లేదు ? సరఫరాకు సంస్థలు ముందుకు రాకపోవడానికి కారణం గతంలో మీరు కాంట్రాక్టు సంస్థలకు బిల్లు బకాయిలు చెల్లించక పోవడమే కారణం కాదా ?? వైద్య కళాశాలలకు కేంద్రం ఇప్పటికే 300 కోట్లు ఇచ్చింది, ఇంకా  600 కోట్లు కావాలని అడిగింది వాస్తవం కాదా ? ఇండ్లు నిర్మాణానికి కేంద్రం సింహ భాగం నిధులిస్తున్నపుడు ఎందుకు మోదీ గారు కేంద్రం పాత్ర ఉందని చెప్పరు. అకాల వర్షం వల్ల రైతులకు జరిగిన పంట నష్టం నుండి ప్రభుత్వం ఆదుకోవాలి.