మోదీకి ఎంపీ రఘురామరాజు లేఖ

125

ఒకవైపు తన పార్టీ అధినేత, సీఎం జగన్‌పై యుద్ధం చేస్తూనే, మరోవైపు తన నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎంపీ రఘురామకృష్ణంరాజు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రైల్వే సమస్యలపై లేఖ రాసిన రాజు, తాజాగా ఫిషరీస్ వర్శిటీ కోసం ప్రధాని మోదీకి  లేఖ రాశారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామ పేర్కొన్నారు.

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, మధుమేహం, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను లేఖలో రఘురామరాజు కోరారు.