ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

177

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇతర ఐఏఎస్‌ల బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి.

 శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ బదిలీ

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా  బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానాన్ని భర్తీ చేస్తూ  ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ లతకర్ శ్రీకేశ బాలాజీరావును జిల్లా కలెక్టర్ గా నియమించారు.

శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ బదిలీ
శ్రీకాకుళం కలెక్టర్‌గా ఎల్‌.ఎస్‌.బాలాజీరావు నియామకం
అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ
అనంతపురం కలెక్టర్‌గా నాగలక్ష్మి నియామకం
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్‌ నియామకం
చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా వెంకటేశ్వర్‌ నియామకం
అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా టి.నిశాంతి నియామకం
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా రోనకి గోపాలకృష్ణ నియామకం
ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విశ్వనాథం నియామకం
కడప జాయింట్‌ కలెక్టర్‌గా ధ్యానచంద్ర నియామకం
తూ.గో జాయింట్‌ కలెక్టర్‌గా జాహ్నవి నియామకం
కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌గా ఎన్‌.మౌర్య నియామకం
కృష్ణా జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌.ఎన్‌.అజయ్‌కుమార్‌ నియామకం
గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా అనుపమా అంజలి నియామకం
నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా విదేహ్‌ కేర్‌ నియామకం
పశ్చిమగోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా ధనుంజయ్‌ నియామకం
విశాఖ జాయింట్‌ కలెక్టర్‌గా కల్పనా కుమారి నియామకం
విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా మయూర్‌ అశోక్‌ నియామకం
శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా హిమాన్షు కౌశిక్‌ నియామకం
ఏపీ ఆగ్రోస్‌ ఎండీగా ఎస్‌.కృష్ణమూర్తి
గ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు నియామకం