గోదావరిలో క్షత్రియులు.. ఒక చరిత్ర!

283
(డి. వి. ఏ. చౌదిరి)

క్షత్రియులు గోదావరి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు అది ముమ్మాటికీ నిజం కూడాను . కానీ వారి పూర్వీకులు ఇక్కడి వారు కాదు ఉత్తర భారతదేశనికి చెందిన వారు . ప్రారంభంలో క్షత్రియులు కేవలం రెండు వంశాలకు చెందిన వారు అవే సూర్య వంశం , చంద్ర వంశం . సూర్యభగవానుడి వారసులను సూర్య వంశం వారిగా, చంద్రుని వారసులను చంద్ర వంశం వారిగా పిలిచేవారు. సూర్య వంశంలో గొప్ప మహారాజులు శ్రీ రామచంద్ర ప్రభువులు , కర్ణు ప్రభువు. అదే , చంద్ర వంశం చెందిన రాజులలో గొప్ప రాజు శ్రీ కృష్ణ పరమాత్మ , బలరాము ప్రభువులు.

చంద్ర వంశ రాజుల్లో చాలా రకాలు విభిజనలు జరిగాయి కానీ సూర్య వంశంలో ఎటువంటి విభిజనలు జరగలేదు కావున భారత దేశాన్ని అత్యధిక కాలం సూర్య వంశ మహా రాజులే పరిపాలన సాగించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షత్రియులు సూర్య వంశానికి చెందిన వారు. ఆంధ్ర ప్రాంతానికి రాక ముందే వారికి గోత్ర నామాలు ఉన్నాయి అని చరిత్ర చెబుతోంది, వీరు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లాగే వీరు కూడా ఇంటి పేరు ను తమ నామ ధేయం ముందు పెట్టుకోవడం జరిగింది , వారు పరిపాలన వ్యవస్థ యొక్క వారసులు కాబట్టి వెనుక రాజు , వర్మ అనే బిరుదులను పెట్టుకున్నారు.

క్షత్రియులు ఒరిస్సాలో ఉన్న బరంపురం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు అనేక దశల్లో పరిపాలన సాగించారు, వీరిలో అత్యధిక కాలం రాజ్యాధికారం చేసింది మాత్రం విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన పూసపాటి వంశస్థులు . వీరు ఒరిస్సాలో సాగ భాగాన్ని మరియు ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర ( గుంటూరు జిల్లా మినహా) ప్రాంతాలను పరిపాలించారు. వీరి తరువాత విశాఖపట్నం ప్రాంతంలో భీమిలి కేంద్రంగా సాగి వంశస్థులు , తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట ను సాగి వంశస్థులు, రామచంద్రపురం ను కాకర్లపూడి వారు, పెద్దాపురం, గొల్లప్రోలు మరియు తుని ప్రాంతాలను వత్సవాయి వంశస్థులు, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మరియు భీమవరం ప్రాంతాలను వత్సవాయి, కలిదిండి మరియు మరికొందరు వంశస్థులు , కృష్ణా జిల్లా లో పెనుగంచిప్రోలు ప్రాంతాన్ని వత్సవాయి వంశస్థులు , మిగిలిన జిల్లా మెట్టసీమ ను పూసపాటి వంశస్థులు పరిపాలించారు. అలాగే, ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రాంతాన్ని చుండి గ్రామం నుండి చుండి రాజులు పరిపాలించారు.

అలాగే, పైన పరిపాలన చేసిన రాజుల కింద సామంత రాజులు అనేకులు తరువాత కాలంలో గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతంలో, సత్తెనపల్లి ప్రాంతాల్లో . అలాగే, రాయలసీమ జిల్లా లైన చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాలన చేశారు.

18 వ శతాబ్దం చివర్లో ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లో జమీందారి విధానాన్ని అమలు చేసిన తరువాత అప్పటి వరకు భూస్వామ్య కుటుంబాలుగా ఉన్న చాలా మంది క్షత్రియ రాజులు జమీందారులుగా నియమించబడ్డారు, వీరు ఇప్పటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రాజుపాళ్యం ప్రాంతానికి కూడా జమీందారులుగా నియమించబడ్డారు, వీరు పూసపాటి వంశస్థులు , వీరి కుటుంబం లో ఆఖరి జమీందారు పూసపాటి కుమారస్వామి రాజా గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేశారు.

ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్షత్రియులు విద్య మరియు పారిశ్రామిక రంగాల్లో, విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతూ తమ పూర్వీకులు నుంచి వచ్చిన దాతృత్వ గుణాన్ని విడవకుండా, పలు సామాజిక కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయం చేయడమే కాకుండా.. నిరుపేద విద్యార్థులకు చదువుకునేందుకు ఉపకరవేతనాలు, ఉపాధి కల్పన వంటి పలు సహాయాలు చేస్తున్నారు.