కథా దీప ధారికి కళింగసీమ నివాళి

235

కారా లేరు కథా ‘యజ్ఞం’… కదిలిస్తూనే ఉంటుంది

కథా నిలయం కారా (కాళీపట్నం రామారావు) గారు ఈరోజు (2021 జూన్ 4)ఉదయం కన్నుమూశారు. ఆయన 97 సంవత్సరాల 5నెలల 5రోజులు భౌతికంగా ఈనేలపై మన మధ్య కథా స్వాశతోనే జీవించారు. మరో రెండున్నర సంవత్సాలు ఆయన జీవించివుంటే… శత వత్సర కారా గా చరిత్రలో నిలిచేవారు. అయినా కారాకు ఆధునిక సాహిత్య చరిత్రలో కావలసినంత చోటు సుస్థిరమైంది మిగిలింది. కారా మాష్టారు 1924 నవంబర్ 9న జన్మిచి…తన జీవితాన్ని గణిత ఉపాధ్యాయునిగా బోధనతో పాటు కథలకీ.. కథా నిలయానికే అంకితం చేసిన నిత్య కథల కృషీవలుడు మన కారా. ఆయన అమరత్వం చెంది మన మధ్యన భౌతికంగా లేకపోయినా తరతరాల సాహిత్య చరితకు కథా ఉత్తేజంగా నిలిచే వుంటారు. ఆయన కథల మాష్టారే కాదు. కథా దీపధారి… శ్రీకాకుళం నేలలో రైతాంగ జీవిత సంఘర్షణల  కథా ‘యజ్ఞా’నికి ఆద్యుడాయన. ఆయన యేసిన కథల తోవలో ఎందరో యెందరెందరో నడక సాగిస్తున్నారు.కథా రచనల ప్రయాణం సాగుతూనే ఉంది… నిరంతరంగా ఉంటుంది కూడా… ఆయన లేని లోటు అలాగే ఉన్నా… చూపిన మార్గం ఇంకా మరెందరికో దారి దీపమవుతూనే ఉంటుంది. కారా మృతికి ఉత్తరాంధ్ర పత్రిక, కళింగసీమ సాహిత్య సంస్థ నివాళులు….