యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు

310

ఇప్పటికే సుమారు 67 మందిని అదుపులో తీసుకొని, కొంత మందిపై సస్పెక్ట్ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది.
 అడిషనల్ యస్.పి స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలు.
 ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.
 డి.యస్.పి నేతృత్వంలో జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు.
 పట్టు బడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం.
 మున్సిపల్, హెల్త్ డిపార్ట్మెంట్, పురప్రజలు కూడా భాగస్వాములు కండి.
 యువత సక్రమైన మార్గానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా ముఖ్యం.
 తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలి.
 చెడు అలవాట్లకు భానిసైనా, లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా అలవాట్లు ఉన్న యెడల పోలీస్ వారికి సమాచారం అందించండి.
 తల్లిదండ్రులకు కూడా త్వరలో కౌన్సిలింగ్ ఏర్పాటు.
 అందరి సహకారం ఉంటేనే మాదక ద్రవ్య రహిత నగారంగా తీర్చదిద్దగలుగుతాం.
 ఎవరైనా, ఎక్కడైనా మారక ద్రవ్యాలు అమ్మడం, చూసినా సమాచారాన్ని పోలీస్ వారికి అందించగలిగితే ఇంకా మెరుగైన సేవ చేయగలుగుతాం.
–  తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు

విచ్చలవిడి తనానికి అలవాడు పడి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్క దిద్దికోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే అనార్తాలు, నష్టాల గురించి యువతకు తెలుసుకొని జాగ్రత్త పడాలి. యుక్త వయస్సులో ఉన్నప్పుడే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ఆలోచనలతో వెర్రి తనంగా ముందుకుపోయి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా ఇలాంటి సమయంలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. ఆడ మగా అని తేడా లేదు అమ్మాయిలు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది. దీని బారిన పడి ఎంతో మంది చిక్కుల్లో పడుతున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మొదట్లో తమాషాగా తీసుకునే ఈ మత్తపదార్థాలు ఆ తరువాత క్రమం క్రమంగా వారే దానికి బానిసలుగా మారిపోతుంటారు. ఈ క్రమంలోనే నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుంది. మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని కోట్లు గడిద్దామని ఎవరైనా భ్రమ పడి అమాయక యువతను, విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తే అత్యంత చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవు. ఇది హెచ్చరిక కాదు, ఆదేశాలు కూడా. మాదక ద్రవ్యాల విక్రయ మూఠాలపైన, వినియోగించేవారిపైన అడిషనల్ యస్.పి స్థాయి అధికారిచే గట్టి నిఘా ఏర్పాటు చేసాము. ఎవరైనా, ఎంతటి వారైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పిల్లలను, యువతను టార్గెట్ గా చేసుకుని కొందరు కమీషన్ల కోసం ఇలాంటి మత్తు పదార్థాలు విక్రయిద్దామని చూస్తే కటకటాలు తప్పదు.

 ముఖ్యంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోడం, ఉద్యోగ సమస్య వంటివి యువత మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి అలవాటు ఉండటం పిల్లల్ని మత్తుపదార్థాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఒకసారి బానిసైతే చాలు దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మత్తు పదార్థాల సరఫరాలను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. కానీ ఏదో ఒక విధంగా అలవాటు పడినవారు దానినే ఒక వృత్తిగా చేసుకొని వీరి జీవనాదారం కోసం యువతను ఇందులోకి లాగుతున్నారు. ఇది మారాలంటే చాలా మంది సహకారం అవసరం. ఒక్క రోజుతో పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం కాదు, తల్లిదండ్రు, ప్రజలు, ఇతర శాఖల వారి సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది.

తల్లిదండ్రులు కాలేజీలకు, ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్తున్న వారిపై శ్రద్ద తీసుకోవాలలి. అవారాగా తిరుగుతున్న వారి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తనలో ఉన్నారో అనే విషయాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలి.

తల్లిదండ్రుల సహకారం లేనిది ఏమి చేయలేము. వీరితో పాటు ప్రజలు ఇతర శాఖల అధికార యంత్రంగా వారు కూడా తోర్పాటు అందించగలగాలి అప్పుడే పూర్తిగా నిర్మూలించగలుగుతాం. యువత ఒక్కసారి ఆలోచించాలి. లేకుంటే మీ కుటుంబాలు ఛిద్రమౌతాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా  యస్.పి  వెంకట అప్పల నాయుడు  తెలిపారు.