రెండేళ్ళలో జరిగిన అరాచక పాలనపై జగన్ బుక్ రిలీజ్ చేయాలి

115

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

జగన్ రెండేళ్ల పాలనలో చేసింది శూన్యమని మాజీమంత్రి నక్కా. ఆనంద్ బాబు చెప్పారు. గుంటూరు జిల్లా వేమూరు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ రెండేళ్ల లో జగన్ తన అరాచకాల మీద పుస్తకం విడుదల చేస్తే బాగుంటుందని సూచించారు. ఇళ్లకు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేసిన ఘనత జగన్ దే నని, ఇంకా ఎన్ని సార్లు శంకుస్దాపనలు చేస్తారోనని ఎద్దేవా చేసారు. రెండేళ్ల లో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు. గత ప్రభుత్వం లో 9 లక్షల ఎన్టీఆర్ గృహాల నిర్మాణం చేస్తే కక్ష్య పూరితంగా వాటిని పాడుపెట్టిన ఘనడు జగన్ అని దుయ్యబట్టారు. కనీసం ఈ ఇళ్లు క్వారంటైన్ సెంటర్ ల కైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషమన్నారు.

ఇళ్ల స్థలాల మీద దోచుకొని ఎమ్మెల్యే ఒక్కరు కూడా రాష్ట్రం లేరని చెప్పారు. చిన్నపాటి వర్షం వస్తే ఇళ్ల ఫ్లాట్ లు నామమాత్రం కూడా కనపడవని స్పష్టం చేసారు.ఇళ్ల స్థలాల పంపిణీ అంతా ఓ పెద్ద  కుంభకోణమని ఆరోపించారు.  అదేవిధంగా ఇసుక నిగుప్తాదిపత్యంగా  జేపి  వెంచర్స్ కి ఇచ్చి వేళా కోట్ల రూపాయలు జగన్  దోచుకుంటున్నారని ఆరోపించారు. వేమూరు రైతు మార్కెట్ యార్డ్ రైతుల కోసం కడితే ఇసుక నిల్వలు ఉంచటం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు.