చంద్ర‌బాబు, లోకేష్‌ జైలుకు వెళ్ల‌డానికి అర్హులు, జైలుకు వెళ్లే రోజులు ద‌గ్గ‌ర్లోనే..

96

– డెమోక్రసీని జూమోక్రసీగా చంద్రబాబు మార్చారు
– ఓట్లు వేయలేదని దళితుల్ని అణగదొక్కాలని చూస్తే బాబుకు పుట్టగతులుండవ్
– స‌మాజాన్ని, ద‌ళితుల్ని చీల్చేశారు.. బీసీలే పార్టీకి వెన్నెముక అని వారినీ బాబు నాశ‌నం చేశారు.
– నక్క జిత్తుల చంద్రబాబూ.. మీ కుట్ర రాజకీయాలతో ఇంకా ఎన్ని కొంపలు కూలుస్తారు..?
– లోకేష్ త‌న కొడుకుని ఇంగ్లీషు మీడియంలో చ‌దివిస్తున్నాడా లేక తెలుగు మీడియంలో చదివిస్తున్నాడా..?
– పేద‌లందరికీ ఇళ్లు సామాజిక‌ న్యాయ చ‌రిత్ర‌లో ఓ సువ‌ర్ణ అధ్యాయం
– వైయ‌స్ఆర్పీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్

డెమోక్ర‌సీలా కాదు.. జూమోక్ర‌సీ త‌యారు చేసి చంద్ర‌బాబు జూమ్ మీటింగ్ లు పెట్టుకుని రోజూ మాట్లాడుతున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జూమ్ రిహార్సల్స్ లోనే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మ‌న‌కు ఎస్టీలు, ఎస్సీలు, క్రిస్టియ‌న్లు, మైనార్టీలు ఇంకా మరికొన్ని వ‌ర్గాలు దూర‌మైపోయారు, దీనిపై రిజుల్యూష‌న్ చేయాలంటే న‌క్క‌జిత్తుల చంద్ర‌బాబు మ‌నం డైరెక్ట్ గా రిజుల్యూష‌న్ చేస్తే వారికి తెలిసిపోతుంది కాబ‌ట్టి ఇన్ డైరెక్ట్ గా చేయాల‌ని అంటున్నారు. ఇన్ డైరెక్ట్ గా ఎన్ని కొంప‌లు కూలుస్తారు చంద్ర‌బాబూ..?

– ఇన్ డైరెక్ట్ గా స‌మాజాన్ని, ద‌ళితుల్ని చీల్చేశారు.. బీసీలు పార్టీకి వెన్నెముక అని చెప్పి బీసీల‌ను నాశ‌నం చేశారు.
– 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు, తన హయాంలో గ‌రగప‌ర్రులో ద‌ళితుల మీద దాడులు జ‌రిగితే ద‌ళితుల్ని వెలివేస్తే ముఖ్య‌మంత్రిగా వెళ్లారా? మీ హ‌యాంలో రాపూరు, నెల్లూరులో ద‌ళిత‌వాడల మీద పోలీసులు, మీ మంత్రులు దాడి చేస్తే వెళ్లారా?  ప్రకాశం జిల్లా ప‌ర్చూరు ద‌గ్గ‌ర దళితులపై దాడి ఘ‌ట‌న జరిగితే వెళ్లారా?
చంద్రబాబు హయాంలో జరిగినట్టుగా.. ఈ ప్ర‌భుత్వంలో ద‌ళితుల మీద దాడులు ఎక్క‌డ జ‌రిగాయో చెప్పాలి? ఎక్క‌డో కొన్ని చిన్న చిన్న అంశాల‌ను తీసుకుని ప్ర‌తిదానినీ ముఖ్య‌మంత్రిగారికి పూస్తున్నారు.

– ఈ స‌మాజానికి కోపం వ‌స్తే, ప్రభుత్వం ద్వారా చట్టప్రకారం జైల్లో పెట్ట‌డానికి మీరంద‌రూ అర్హులే.
– అధికారం ఉంటే ఒక‌లా.. అధికారం లేక‌పోతే మ‌రోలా మాట్లాడుతున్నారు.. అందితే జుట్టు లేక‌పోతే కాళ్లు ప‌ట్టుకునే విధంగా నిరంత‌రం  జ‌గన్ ని శపించ‌డ‌మే పనిగా చంద్ర‌బాబు పెట్టుకున్నారు.
– హైదరాబాద్ లో కుర్చొని కుట్ర‌లు ప‌న్నండి కానీ, ఈ రాష్ట్రంలో సామాజిక విప్ల‌వానికి నాంది ప‌లుకుతోన్న జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించి తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేయాలనే మీ కల నెరవేరదు.

– అమ‌రావ‌తిలో 54వేల పేద కుటుంబాల‌కు ఇళ్లు ఇవ్వాలంటే డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బ‌తింటుంద‌ని కోర్టులో వాదిస్తున్నారు.. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అమరావతి రాజ‌ధాని ప్రాంతంలో ఇళ్లు క‌ట్టుకుని నివ‌సిస్తే డెమోగ్ర‌ాఫిక్  దెబ్బ‌తింటుంద‌ని వాదించే నీచ‌మైన మ‌న‌స్త‌త్వంతో చంద్ర‌బాబు ఉన్నారు. మిమ్మ‌ల్ని జైలులో పెట్ట‌డానికి ఇంత‌క‌న్నా ఏం అంశం కావాలి..?
-లోకజ్ఞానం లేదు సరే..  సిగ్గు అన్నది కూడా లేకుండా మాట్లాడుతున్న లోకేష్.. గ‌తంలో ద‌ళిత కాల‌నీల‌కు క‌రెంట్ క‌ట్ చేశారు, మంచినీళ్లు లేకుండా చేశారు.
సామాజిక మార్పు, సామాజిక విప్ల‌వంలో భాగంగా జ‌గ‌న్  హెల్త్ అండ్ ఎడ్యుకేష‌న్ కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీనిని అడ్డుకుంటున్న మీ విధానాల‌ను ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు గమనిస్తున్నారు. ప్ర‌జ‌లు తెలివిత‌క్కువారు, మ‌ర్చిపోతారు అనుకుంటే అది మీ పొర‌పాటే చంద్ర‌బాబు..

– సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మీ పార్టీ పరిస్థితి గురించి నిజం చెబితే.. లేదు దీనిని మ‌నం ర‌హ‌స్యంగా చేయాలి, లేక‌పోతే అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత యాక్ష‌న్ లో చూపించాలని చంద్ర‌బాబు మాట్లాడుతున్నారు..

– అస‌లు మీరు మళ్ళీ అధికారంలోకి వ‌స్తామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారా? ఈ రాష్ట్రంలో నిరంత‌రంగా జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసిన త‌ర్వాత కూడా మీరు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చే అవ‌కాశమే లేదు.
జ‌గ‌న్ ప‌ది సంవ‌త్స‌రాలుగా నిరంతరం ప్రజల్లో ఉండి,  ఓదార్పు యాత్ర నుంచి సంక‌ల్ప యాత్ర వ‌ర‌కు ప్ర‌తి కుటుంబాన్ని ప‌ల‌క‌రించి,  ప్ర‌తి వ్య‌క్తి మ‌న‌స్త‌త్వాన్ని తెలుసుకుని వారికి నిరంత‌రం అండ‌గా ఉంటూ, పేద‌రికంతో అల్లాడిపోతున్న వారిని ఆదుకుంటుంటే..  ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుంది..? అంటే పేదల సంక్షేమానికి ఖర్చు పెడితే.. అప్పులు అంటారా..? అదే మీ దోపిడీ కోసం, కమీషన్ల కోసం, మీరు అప్పులు చేసి, మీ వాళ్ళకు పప్పు బెల్లాల్లా పంచిపెడితే మాత్రం అది అభివృద్ధా..?

చంద్ర‌బాబు పరిపాల‌న‌లో  రాష్ట్రం ఏం అభివృద్ది చెందిందో చెప్పాలి. ఒక వేళ అభివృద్ది చెందితే, ఇప్పుడు రాష్ట్రంలో 30ల‌క్ష‌ల మంది పేదవర్గాలకు ఇళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వ‌చ్చింది? మీ హయాంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ఎంత‌మంది చదువుకున్నారు?

– చంద్ర‌బాబు హ‌యాంలో పేద‌వ‌ర్గాల‌ను పూర్తిగా విస్మరించి.. ఎంతసేపటికీ తన వ‌ర్గాల‌కు, తన మ‌నుషుల‌కు సువ‌ర్ణ‌యుగంగా మార్చుకుని, మొత్తం రాష్ట్రాన్ని తొక్కేస్తే, 2019లో ప్రజలు బుద్ధి చెప్పి అధికారం నుంచి ఊడగొట్టారు. నేడు మీ స్వార్థ రాజకీయాల కోసం కొంత‌మంది గుంటనక్కల్ని ఉప‌యోగించుకుని జ‌గ‌న్ మీద దుష్ప్రచారం చేస్తుంటే ఎవ‌రూ స‌హించ‌రు.

– జిత్తుల‌మారి న‌క్క వేషాలు వేసే చంద్ర‌బాబునాయుడి మీద, ప్ర‌భుత్వ‌ం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అనేక విధాలుగా ల‌బ్ధిపొందుతున్న ప్ర‌జ‌లంద‌రూ తిర‌గ‌బ‌డాలి. స్వార్థ రాజకీయాలతో దొంగ‌లు మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతుంటే తిరుగుబాటు చేయాలి.

ఈ రెండు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం నుంచి కోట్లాది కుటుంబాలు ల‌బ్ధి పొందుతుంటే, మ‌హిళా సాధికార‌తకు పెద్ద పీట వేస్తూ, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆలోచ‌న‌ల‌ను అమలు చేస్తుంటే, దానిని ఓర్చుకోలేక చంద్ర‌బాబు చేస్తున్న డ్రామాలు, డిజిట‌ల్ మహ‌నాడు పెట్టుకుని  ఆడుతున్న డ్రామాలు, రిహార్సల్స్ చూస్తున్నాం. అస‌లు మీకు అధికారం వ‌స్తేనే క‌దా..?  మీ ఆలోచ‌న‌లే కాదు, మీ బుర్ర‌లే కూడా తుప్పుప‌ట్టిపోయాయి. చంద్ర‌బాబును అబద్ధాలకోరు, దొంగ, ఇత‌ని మాట‌లు న‌మ్మ‌డానికి వీల్లేద‌ని సగటు మ‌నిషి అంటున్నారు.

ఈ రోజు పేదవాడి పొట్ట నిండ‌డం, పేద‌వారికి ఆత్మ‌గౌర‌వంతో బతకాలంటే ఇల్లు ఉండ‌డ‌మే ముఖ్యం. పేద‌వాడు కూడా ఈ రాజ్యంలో నేను కూడా ఒక మ‌నిషిని అని కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరిగే ప‌రిపాల‌న  జ‌గ‌న‌న్న ఇస్తున్నారు. డా. బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేస్తున్న క్ర‌మంలో ప‌బ్లిక్ పాల‌సీని ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా తీసుకువ‌స్తున్న నేప‌థ్యం ఇది. ప‌బ్లిక్ పాల‌సీ ఎప్పుడైతే ప్ర‌జ‌ల్లోకి వెళ్తుందో ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుప‌డుతుందని ఎంతోమంది ప్రముఖులు, గొప్పవారు చెప్పారు.

75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త‌దేశంలో, ప్ర‌ధానంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త రెండు సంవ‌త్స‌రాల వైయస్ జగన్ మోహన్ రెడ్డి  అద్భుతమైన పరిపాలన.. ఆయన పాలనలో అమలవుతున్న పథకాల తీరుతెన్నులను తరచి చూస్తే.. డా. బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అత్యున్న‌త గౌర‌వం ద‌క్కే విధంగా పరిపాలన జరుగుతుందన్నది అందరికీ అర్థమవుతుంది.

ఈ రోజు సీఎం  జ‌గ‌న్ శంకుస్థాప‌న చేసిన 31 ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాలు, క‌ట్ట‌బోతున్న 28ల‌క్ష‌ల ఇళ్లు. ఇవి ఇళ్లు కాదు.. ఊళ్లుగా త‌యార‌వుతున్నాయి.. ఇవి పాత‌కాల‌పు ఊళ్లు కావు.. ఇవి న‌వీన‌ యుగంలో లేదా మోడ్రన్ కంట్రీలో గేటెడె కమ్యూనిటీలుగా త‌యార‌వుతున్నాయి. ఇది  31ల‌క్ష‌ల మందికి ఇళ్ల పండుగ‌.
– ఈ కాల‌నీల్లో నెట్ వ‌ర్క్ సిస్టమ్, అండ‌ర్ గ్రౌండ్ కేబుల్, వాట‌ర్, క‌రెంట్, క‌మ్యూనిటీ హాల్స్ , స‌క‌ల సౌక‌ర్యాల‌తో అద్భుత‌మైన గేటెడ్ క‌మ్యూనిటీగా వీటిని త‌యారుచేస్తున్నారు.

– దేశంలో ఇది అద్భుత‌మైన ప‌రిపాల‌న‌కు నాంది, ఒక సువ‌ర్ణ‌యుగం. సామాజిక న్యాయ చ‌రిత్రలో చూసిన‌ట్ల‌యితే సామాజిక న్యాయం ఈ ప్రభుత్వంలో జరిగిందని గ‌ర్వంగా చెబుతున్నాం.  క‌రోనా నేపథ్యంలో దేశంలో దాదాపు 8 కోట్ల మంది వలసదారులు, త‌మ‌కంటూ ఒక ఇల్లు కూడా లేని వారు  రాష్ట్రాలు దాటి ఊర్ల‌కు బ‌య‌లుదేరారు, ఇటువంటి వారికి అడ్ర‌స్ లు లేవు. కాబ‌ట్టి అడ్ర‌స్ లు క‌లిగి ఉండ‌డ‌మే ఒక ఆత్మ‌గౌర‌వం.

ఈ రాష్ట్రంలో 31ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇంటిని, ఒక అడ్రస్ ను ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక న్యాయ చ‌రిత్ర‌లో ఆర్దికంగా, సామాజికంగా ఆత్మ‌గౌర‌వంతో మ‌నిషిని నిల‌బెట్టే ఒక అద్భుత‌మైన కార్య‌క్ర‌మాన్ని సీఎం  వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్నారు. అందుకే చంద్ర‌బాబుకి, లోకేష్ కు నిద్ర‌ప‌ట్ట‌ట్లేదు.

– రాజకీయంగా వెనుక‌బ‌డిపోయి, శిధిలమ‌వుతూ, ఆ శిధిలాల్లో న‌లిగిపోవ‌డానికి చంద్ర‌బాబు, లోకేష్‌ సిద్ధంగా ఉన్నారు.
జ‌గ‌న్  పేద‌ల‌ ప‌క్షాన నిల‌బ‌డ్డారు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీషు మీడియం ప్ర‌వేశ‌పెడుతుంటే, శాసన మండలి నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఈ వర్గాలన్నీ ఇంగ్లీషు మీడియం చదువులు చదివి బాగుపడిపోతే.. ఇక తమ బతుకులు ఏమైపోతాయి, మా ఇళ్ల‌ల్లో పాచిపనులు ఎవ‌రు చేస్తారు, మా ఇళ్ల ద‌గ్గ‌ర వాచ్ మెన్ లుగా ఎవ‌రుంటార‌ని ఓ వర్గం బెంబేలెత్తిపోయింది.

– డా.బీ.ఆర్. అంబేద్క‌ర్ కొలంబియా యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఇంగ్లీషు లాంగ్వేజ్ గొప్పతనం గురించి చెబుతూ… పులి పాలు తాగితే ఎంత శ‌క్తివంత‌గా ఉంటారో.. ఇంగ్లీషు నేర్చుకుంటే అంతే శ‌క్తివంతంగా ఉంటార‌న్నారు. అటువంటి ఇంగ్లీషు ను పేద‌వ‌ర్గాల‌కు, గ్రామాలకు చేరువ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఈ రాష్ట్రంలో ఉన్న ద‌ళితులు, పేద‌లు, మైనార్టీ వ‌ర్గాలవారు ఈ ఇళ్ల స్థ‌లాల ద్వారా వేల కోట్ల రూపాయాలు బెనిఫిట్ పొందుతున్నారు.

–  చంద్ర‌బాబు త‌న ఐదేళ్ల పరిపాల‌న‌లో ఏం క‌ట్టారో, ఏం చేశారో చెప్పాలి..
– ద‌ళితుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని మాట్లాడుతున్నారు.. దళితులకు అన్యాయం ఎక్క‌డ జ‌రిగింది? కోటి మంది ద‌ళితులున్న రాష్ట్రంలో ఈ రెండు సంవ‌త్స‌రాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది. ద‌ళితుల‌కు జ‌రుగుతున్న మేలును చూసి చంద్ర‌బాబు ఆయ‌న కొడుకు లోకేష్  ఓర్వలేకపోతున్నారు.
లోకేష్ త‌న కొడుకుని ఇంగ్లీషు మీడియంలో చ‌దివిస్తున్నారా? లేక తెలుగు మీడియంలో చ‌దివిస్తున్నారా?

– లోకేష్ త‌న కుమారుడికి ఇంగ్లీషు మీడియంను ఎంచుకుంటే మీరు పంపించే ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు కన్నా, మా జ‌గ‌నన్న ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు అద్బుతంగా ప‌నిచేస్తున్నాయి. అక్క‌డ జాయిన్ చేయండి.

– మీరు మాత్రం మీ పిల్ల‌లకు ఇంగ్లీషు నేర్పిస్తూ, ఇంగ్లీషు మీడియంలో చ‌దివిస్తూ.. పేద వ‌ర్గాలు మాత్రం ఇంగ్లీషుకు దూరంగా ఉండాల‌నుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం..?

– రాష్ట్ర చరిత్రలో నేడు ఒక నూత‌న అధ్య‌ాయాన్ని, సామాజిక విప్ల‌వాన్ని తీసుకురావడం కోసం ప్ర‌జ‌లు ఎన్నుకున్న నాయ‌కుడు జ‌గ‌న్  ఆ దిశ‌గా ముందుకు వెళ్తున్నారు.

ఈ 31ల‌క్ష‌ల మంది పేద‌వ‌ర్గాలు, పేద‌వ‌ర్గాల్లో ఉన్న అగ్ర‌వ‌ర్ణాలు, అద్దె ఇంట్లో ఉంటున్న వారంద‌రికి కూడా ఈ ప్ర‌భుత్వం ఈ మహాత్తర కార్య‌క్రమానికి నాంది ప‌లికింది.

– జగనన్న కాలనీల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు సీఎంగారు మాట్లాడుతూ.. ఈ పథకం కింద ఒక‌వేళ ఎవ‌రైనా మిస్ అయితే 90 రోజుల్లో తిరిగి వారికి ఇంటి పట్టా ఇవ్వాలంటున్నారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వాన్ని,జ‌గ‌న్ ని ఆశీర్వ‌దించండి, పరిపాలనను ఆహ్వానించండి.

– ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే చీపురుక‌ట్ట తీసుకుని బుద్ది చెప్పండి. చంద్ర‌బాబు, లోకేష్ లు ఈ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే అర్హ‌త ఎప్పుడో కోల్పోయారు. చంద్ర‌బాబు, లోకేష్‌ జైలుకు వెళ్ల‌డానికి అర్హులు, జైలుకు వెళ్లే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి.