కరోనా కట్టడికి ఆయుర్వేద మందు పుత్తూరులో తయారి…..

131

కరోనా బాధితులకు ఆయుర్వేద మందుతో కట్టడి చేయవచ్చని పారంపర్య వైద్య మహా సంఘం అద్యక్షులు, శల్యవైద్యులు ఎస్. చంద్రశేఖర్ రాజు తెలిపారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ దర్మరాజుల స్వామి ఆలయంలో కరోనా కట్టడి చేయడానికి, వ్యాధి నిరోదక శక్తిని పెంచడానికి ఆయుర్వేదం ద్వారా మందును తయారుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సెకండ్ వేవ్  నేపథ్యంలో చాలామంది ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. కరోనా కట్టడి చేయాలంటే మనిషిలో వ్యాథి నిరోదక శక్తిని పెంచుకోవాలని తెలిపారు. మందును తయారు చేయడానికి, అలాగే తయరు చేసే విదానాన్ని వివరించారు.

నెల్లూరు జిల్లా, కృష్టపట్నం లోని ఆనందయ్య కోవిడ్ భాదితులకు ఇస్తున్న మందును, అదే పార్ములా ను ఉపయోగించి ఇక్కడే తయారుచేయునున్నట్ల ఆయన తెలిపారు. తయారుచేయునున్న మందు పూర్తిగా ఆయుర్వేదంతో కూడుకున్నదని, మనకు చుట్టు పక్కల దొరకే వస్తువులతోనే దీనిని తయారు చేయునున్నట్లు తెలిపారు. కాగ ఇది తయారు చేయడానికి సుమారు 10 గంటల పైన పడుతుందని తెలిపారు. పూర్తిగా తయారుచేసిన తరువాత పుత్తూరు మున్సిపల్, తహశీల్దారు, పోలీసులు ఆథ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్  బారిన పడి, వ్యాథి నిరోదక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికై ప్రభుత్వం ఆయుర్వేదాన్ని, ఆయుర్వేద వైద్యన్ని గుర్తించి తగిన విదంగా పోత్సహం ఇవ్వాలని కోరారు.

ఇందులో ఉపయోగించే ఆయుర్వేద మూలికలు దావరదంగి,కుప్పెంట,నేరేడు, మారేడు, మామిడి,వేప, గుంటగలగర,నేలఇసిరి, తెల్లజిల్లేడు, పసుపు,అల్లము,నల్లజీలకర,జాజికాయ,తోకమిరియాలు, అమృతవళ్లి తిప్పతీగ, అల్లం, నల్ల జిలకర్ర, పట్టా, పసుపు, మిరియాలు, పిప్పలు, జాజీకాయ, పచ్చకర్పరం, తాటి బెల్లం, తేనే అని తెలిపారు. పైన చెప్పిన ఆయుర్వేద మూలికలని, దుకాణాలుతో సైతం ఇది దొరుకుతుందని, అలాగే పై వాటిలో చాలావరకు వంటిట్లో మహిళలు వాడుతున్నారని గుర్తు చేశారు. పై వాటిన్నంటికి ఒక మోతాదులో కలిపి రుబ్బి, వేడి చేసిన తరువాత పాకంలా వస్తుందని అదే వ్యాథి నిరోదక శక్తిని పెంపొదింస్తుందని ఆయన తెలిపారు.పై వాటిన్నంటికి ఒక మోతాదులో కలిపి రుబ్బి, వేడి చేసిన తరువాత పాకంలా వస్తుందని అదే వ్యాథి నిరోదక శక్తిని పెంపొదింస్తుందని ఆయన తెలిపారు.
మందును తయారుచేయడానికి అవకాశం కల్పించిన శ్రీ ద్రౌపదిదేవి ఆలయ చైర్మన్ లారీ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయుర్వేద మందును తయరు చేయడానికి పారంపర్య వైద్య సభ్యలు నాదముని ,నక్క బాబు, రాజగోపాల్, ఆదినారాయణ, బాలకృష్ణ, మునిరత్నం నాయుడు, ఎం వేణుగోపాల్ రెడ్డి, యం.శ్రీనివాసులు సహకారంతో చేస్తున్నట్లు ఆయన తెలిపారు.