వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు :పద్మారావు గౌడ్

141

సికింద్రాబాద్ : రానున్న వర్షా కాలంలో సైతం ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి  తీగుల్ల పద్మారావు గౌడ్  ఆదేశించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  సితాఫలమండీ, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించి మాన్సూన్ టీముల వాహనాలను  తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లతుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని వివరించారు. సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. వర్షా కాలంలో అధికారుల బృందాలు అప్రమతంగా నిలవాలని, ప్రజలకు అత్యవసర సందర్భాల్లో సేవలను అందించాలని అయన కోరారు.     మాన్సూన్ బృందాలకు పలు పని ముట్లను కుడా అందించా మని తెలిపారు. కార్పొరేటర్లు కుమారి సామల హేమ,  కంది శైలజ, ఈ ఈ ఆశా, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.