టిబెట్ – బౌద్ధం – దలైలామా

261
Tibetan Buddhist monks holding ceremonial scarfs stand in a line to welcome their spiritual leader the Dalai Lama, fourth left, as he arrives at the Jhonang Takten Phuntsok Choeling monastery in Shimla, India, Tuesday, March 18, 2014. (AP Photo/Tenzin Choejor)

నేడు టిబెట్ గా పిలవబడుతున్న దేశపు పాత పేరు తిబ్బత్. అత్యంత విశాల దేశం. హిమాలయాలకు ఉత్తరం వైపు ఉంటుంది. ఎక్కువ పర్వత ప్రాంతం. భారత్ నుండి చైనాకు టిబెట్ గుండా నడక మార్గాలు రెండు.

1) సిక్కిం గుండా ప్రాచీన సిల్కు మార్గం,ప్రాచీన వ్యాపార మార్గం.
2) టీ హార్స్ మార్గం.

లాసా ప్రాచీన బౌద్ధ కేంద్రం, టిబెట్ ముఖ్య పట్టణం.

బుద్ధుడు తనువు చాలించిన 700 సంవత్సరాలకే అంటే 3వ శతాబ్దంలో టిబెట్ లోకి బౌద్ధం ప్రవేశించింది. స్థానిక మతం బాన్ (Bon) ను ప్రజలు ఆచరిస్తున్నా 6-7 శతాబ్దాలలోని అక్కడి చక్రవర్తులు భారత్ లోని బౌద్ద భిక్షువులను ఆహ్వానించారు. వారిలో పద్మ సంభవుడు (725-788), గురు పిన్ పోచే (749) ముఖ్యులు.

వీరి వల్ల టిబెట్ లో బౌద్ధం వేళ్ళూనుకుంది. టిబెట్ లో అత్యంత ప్రాచీన బౌద్ధ కేంద్రం 775-779 నాటి సామ్యే (samye) లోనీ భవనం దర్శనం ఇస్తుంది. తర్వాత కాలంలో టిబెట్ బౌద్ద మత దేశంగా ప్రకటించబడింది. అనేక బౌద్ద సంప్రదాయాలు ఉన్నా అక్కడ ఉన్నది “వజ్రయానం “.

Gendum Drumbpa మొదటి దలైలామా (1391-1474). దలైలామా అంటే బౌద్ద ధర్మ మత పెద్ద. ఉన్నత స్థాయి లామాలు కొన్ని సంకేతాలు ఆధారంగా, ప్రశ్నలతో బుద్ధుని అవతారంగా పుట్టిన బాలుణ్ణి గుర్తిస్తారు. ఆ బాలునికి బౌద్ద ధర్మంలో శిక్షణ ఇస్తారు. నేడు ఉన్నది 14వ దలైలామా. వీరి అసలు పేరు Tenozin Gyatso. వీరి వయస్సు నేడు 80 సం.లు. చైనాలో ప్రాచీన స్థానిక మతం Tooism.

మహాయాన బౌద్ధం+ టూ ఇజం కలసి పోయాయి…..

మార్క్సిజం మతంను మత్తు మందుగా పేర్కొన్నది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1950లో చైనా సేనలు టిబెట్ ను ఆక్రమించి బౌద్ద సన్యాసులను ఊచకోత కోశాయి. దాంతో నేటి దలైలామా భారత దేశం వచ్చి చేరారు. హిమాచల్ ప్రదేశ్ లో 1959 లో టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పడింది. నేటికీ చైనా ప్రజలలో బౌద్ద మతం పట్ల ఎంతో శ్రద్ద ఉంది. టిబెట్ లో బౌద్ద మతం అణిచివేతలో భాగంగా నూతన దలైలామా నియామకం తమ ప్రభుత్వ అనుమతితోనే జరగాలని చైనా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కొత్త దలైలామా గుర్తింపు ధార్మిక మైనది. ఇది స్వతంత్ర విధానం. ఇందులో ఏ ప్రభుత్వ జోక్యం ఉండరాదు. అమెరికా,జపాన్ దేశాలు నేటి చైనా ధోరణిని నిరసిస్తున్నాయి. తాను తన 90 వ ఏట నూతన దలైలామా ఎంపికను ప్రకటిస్తానని ప్రకటించారు. టిబెట్ దేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని టిబెట్ ప్రవాస ప్రభుత్వం, ఇతర దేశాలు కోరుతున్నాయి.

– కె. శ్యామ్ ప్రసాద్, ఆల్ ఇండియా కన్వీనర్, సామాజిక సమరసత.

(VSK ANDHRAPRADESH)