తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాలు, పోరాటాల, ఫలితం

256

తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల, పై ఏర్పడింది. నాడు విద్యార్థులు లేకపోతే నేటి తెలంగాణ రాష్ట్రం లేదు. నాడు ఓయు జెఏసి, కేయూ  జేఏసీ,  విద్యార్థులు బయటకు వచ్చి రోడ్లెక్కి , కలబడి తిరగబడితే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏ ఒక్కరి వల్ల కాదు, ఏ ఒక్క కుటుంబం వల్ల కాదు, అందరి పోరాటాల ఫలితంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం.

కానీ, నేడు కొంతమంది మాత్రమే  ఆ ఫలితం అనుభవిస్తున్నారు.  నాడు విద్యార్థులు తమ విద్యను, ఉపాధి అవకాశాలు, పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నారు, నేడు అదే విద్యార్థులు  నిరుద్యోగులుగా, నిరాశా నిస్పృహలతో, తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.ఉద్యమం తో సంబంధం లేని వారు పదవులు అనుభవిస్తున్నారు. త్యాగం ఒక్కరిదీ, భోగం  ఇంకొకరిది.

విద్య వైద్యం డబ్బున్న వాళ్ళకే చెందుతుంది, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు. అధికారంలో ఉన్న వాళ్లు కోట్లు, కోట్లు, గడిస్తూ తమ ఆస్తులను వందల రెట్లు పెంచుకున్నారు. లక్ష కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం,  నేడు అప్పులపాలు అయిపోయింది, ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూములను అమ్మడం మొదలు పెట్టి వారి ఆస్తులను  పెంచుకుంటున్నారు, ఇందుకే నా తెలంగాణ తెచ్చుకుందని తెలంగాణ  లోకం కన్నీరు కారుస్తోంది.

ఇప్పుడు ఉద్యమనేలన ఉద్యమం మిగిలే ఉంది, ఆ ఉద్యమం విద్యార్థుల తోనే సాధ్యం అవుతుంది, మళ్లీ ఉద్యమ బాట పడదాం, నిరంకుశ పాలన వ్యతిరేకిద్దాం, ఉచిత విద్య, వైద్యం, కలిగిన ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకుందాం. అమరవీరులు ఆశయాలను సాధిద్దాం, అందుకు అందం సిద్ధమవుతోంది.

–  కొప్పుల ప్రతాప్ రెడ్డి ( ఓయూ జేఏసీ చైర్మన్ పరిశోధక విద్యార్థి రాజనీతి శాస్త్రం)
-జానకిరామ్ ముదిరాజ్   (ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ పరిశోధక విద్యార్థి ఆర్థికశాస్త్రం)
– బిక్షపతి నాయక్ (ఓయూ జెఎసి కన్వీనర్)