టీకా వేయించుకుంటేనే జీతం…

441

క‌రోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగంగా అమ‌లు చేస్తున్నారు.  అయితే, వ్యాక్సిన్ పై ఉన్న అపోహ‌ల‌తో వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి సందేహిస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకుంటే విక‌టించి మ‌ర‌ణిస్తార‌ని అపోహ‌లతో ముందుకు రావ‌డంలేదు.  సామాన్యుల‌తో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా టీకా తీసుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తుండ‌టంతో ఆ జిల్లా క‌లెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ క‌లెక్ట‌ర్ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చారు.  టీకాలు తీసుకున్న వారికే జీతాలు చెల్లిస్తామ‌ని క‌లెక్ట‌ర్ చంద్ర విజ‌య్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాల‌కు అనుగుణంగా జిల్లా ట్ర‌జ‌రీ ఆఫీసుకు ఆదేశాలు వెళ్లాయి.  దీంతో టీకాలు వేయించుకున్న జాబితాలో ఉన్న ఉద్యోగుల‌కు మాత్ర‌మే జీతాలు చెల్లించ‌నున్నారు.  జీతాల కోసం ప్ర‌భుత్వ ఉద్యోగులు టీకాలు వేయించుకోవ‌డానికి సిద్దం అవుతున్నారు.