ధ్యానం

724

అంతరాత్మ శక్తిని సాధించడానికి ధ్యానానికి మించిన మార్గం లేదు. మనసులో ఆలోచన శక్తి రావడానికి , ఇతరా ఆలోచనలు లేకుండా మనసు నిర్మలంగా ఉంచాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం, గందరగోళం మధ్య ప్రశాంతత కావాలి. అంతరాత్మ చెప్పే దానిని వినడానికి ప్రశాంతత అవసరం అందుకే గొప్పవారు సాధ్యమైనంత వరకు , ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒక గదిలో నల్లని తెరలు వేసి వెలుతురు తక్కువగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు తప్ప ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకుండా సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎందుకంటే మనం ప్రార్థన, ధ్యానం, యోగం , జపం , మొదలైన సాధనలు చేసినప్పుడు , ఆ గదిలో ఇతరుల ఆలోచనా తరంగాలు మీ సాధనకి అవరోధాలు సృష్టిస్తాయి. ఏ ఆలోచనా లేకుండా, బయట నుంచి ఎటువంటి అలజడి లేకుండా ఉంటేనే మనసు అధీనంలో ఉంటుంది. రోజూ ఒక అరగంట లేక గంట సేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి మీరు. ఆ ధ్యాన సాధన అయిన తర్వాత కూడా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఉంచితేనే ఎన్నో కొత్త ఆలోచనలు, మార్గదర్శకపు సూత్రాలు ఈ విశ్వం నుంచి , సూక్ష్మ ప్రపంచం నుండి , మన ఆత్మ నుంచి అందుతాయి. ఒక సారి మన అంతరాత్మ మార్గదర్శకపు దారిలో నడిస్తే ఎటువంటి పొరపాటు చేయకుండా అపజయం పొందకుండా అవరోధాలు లేకుండా ముందుకు సాగడం కోసం అంతరాత్మ మార్గం చూపిస్తుంది. ఎంత ఎక్కువ సేపు మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే అంతగొప్ప ఆలోచనలు వస్తాయి అంతరాత్మ నుంచి, రకరకాల దివ్య అనుభవాలు కలుగుతాయి. వాటిని ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకోవాలి.
 ఫలానా మనిషితో పలానా పని , పలానా సమయంలో చేయాలి. ఏ సమయంలో ఏం చేయాలి వగైరా లాంటివి అంతరాత్మ సూచిస్తుంది. అధిక ప్రసంగం, వృధా కాలక్షేపం చేయడానికి మీరు సిగ్గుపడుతుంటారు. మనకు తెలియకుండానే మనసు కేంద్రీకృతమై తగిన మార్గదర్శకం పొందుతాం. అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇతరుల వ్యక్తిగత విషయాలను చూడకండి.. వారి వ్యక్తిగత విషయాలలో కల్పించుకోవద్దు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించి వారిని గురించి లేని పోని మాట్లాడటం వలన మీ మనసులో వారికి చోటు ఇచ్చిన వారు అయి మీ సమయం, శక్తి వృద్దా అవుతుంది. వీలైనంత వరకు మంచిగా ప్రవర్తించడం, నిర్మలంగా ఉండాలి. వ్యతిరేక దృక్పథం, తప్పుడు ఆలోచన ఉన్నంతకాలం ఎటువంటి అభివృద్ధి జరగదు. ఇతరుల గురించి ఆలోచించడం మానేయండి. నిస్వార్థ సేవ చేయండి. మీ మనసుపై ఎటువంటి దుష్పరిణామాలు పడకుండా చూసుకోవాలి, ఆత్మభోద, దైవ సందేశం, ఆనందం, ప్రేమ వీటిని పొందడానికి ధ్యానమే మార్గం .