బహుజన తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ రానట్టే….శుభాకాంక్షలు లేనట్టే!

528

కండ్ల ముందు కనుమరుగైన చరిత్ర? 

“పాలకవర్గాలు చెబుతున్న చరిత్రకు సరిగ్గా ఆవలి వైపున ప్రజల చరిత్ర ఉంటుంది”.  తెలంగాణ ఉద్యమంగా చెప్పబడుతున్న చరిత్ర, దాదాపు ఇట్లా కండ్ల ముందే కనుమరుగైందే. 1990ల్లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైతే ..2001లో పుట్టిన పార్టీ కోటాలో పడింది. 90ల నుండి 2001 దాకా తెలంగాణ అన్నందుకే , పోయిన ప్రాణాల లెక్క సంగతి మరిచిపోయారు. 2009లో ఫ్రీజోన్ దగ్గర మొదలైన విద్యార్థి ఉద్యోగుల పోరాటం, అరరోజు దీక్ష అకౌంట్లో పడిపోయింది. విద్యార్థుల “ఛలో అసెంబ్లీ” ప్రకటనకు జడిసి చేసిన దిశంబర్ 9 ప్రకటన, “నిమ్స్ ఫ్లూయిడ్ దీక్ష” ఖాతాలో నమోదయింది.
తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
ఒక సూర్యాపేట డిక్లరేషన్.
ఒక వరంగల్ డిక్లరేషన్.
తెలంగాణ మహాసభ
తెలంగాణ జనసభ
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ
పదిహేడు ముక్కలైన బెల్లి లలిత
మారోజు వీరన్న
ఐలన్న
నల్లా వసంత్
సుదర్శన్
కనకాచారి
ముక్క కరుణాకర్
ఆకుల భూమయ్య
2009 అనంతరం అసువులు బాసిన వందలాది మంది తెలంగాణ బిడ్డలు.
1990 నుండి 2021 కి పెద్దగా ఏండ్లు నిండింది ఏమీలేదు. కానీ, కండ్ల ముందు చరిత్ర మీదే కఫన్ కప్పబడింది.
తెలంగాణ కోసం పోరాడిన ఏడు మండలాల ఆదివాసులను బలిపెట్టి తెచ్చుకున్న తెలంగాణకు శుభాకాంక్షలు ఎందుకో…….???
మారోజు వీరన్న,బెల్లి లలితక్క.చెరకు సుధాకర్,ప్రో,కేశవరావు జాదవ్,విమలక్క, లాంటి ఎందరో  ఉద్యమకారులు  కలలు గన్న బహుజన తెలంగాణ వచ్చేవరకు దొర గడీలను కూల్చేవరకు
మరో తెలంగాణ పోరాటానికి సిద్ధంగా ఉండాలి తెలంగాణ సమాజం…..
పేదరికం,సామాజిక వివక్ష్య,చిన్నచూపు, దోపిడీ, అంటరానితనం మొదలైన అంతరాలు లేని బహుజన తెలంగాణ వచ్చే వరకు
తెలంగాణ రానట్టే….
శుభాకాంక్షలు లేనట్టే….
జోహార్ తెలంగాణ అమరవీరుల కి!

                                                             – జక్కుల నాగయ్య యాదవ్