70 ఏళ్ళలో జరగని ప్రగతి..ఏడేళ్లలో చూపిన ఘనత కేసీఆర్‌దే

495

70 ఏళ్ళలో జరగని ప్రగతి ఏడేళ్లు చేసి చూపిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దని  రాష్ట్ర పశు సంవర్థక ,పాడి, మత్స్య  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆకాంక్షను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పూర్తిగా దూరమయ్యాయ్యని అన్నారు. సాగునీటి కొరత శాశ్వతంగా దూరం చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారుఅని అన్నారు. వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు..ఈ యాసంగిలో జిల్లలో మూడు రెట్ల ధాన్యం పెరిగిందన్నారు.

కుల వృత్తుల పై ఆధారపడిన నేత, గీత, మత్స్య, గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ఖజానా కు ఆదాయం తగ్గినప్పటికీ  సంక్షేమ ఫలాలు మాత్రము యధావిధిగా అమలు చేస్తోందన్నారు.  కరోన లాంటి మహమ్మారిని ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నారు .పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి ఊరూరా వైకుంఠదామలు, ట్రాక్టర్లు, సెగ్రీ గేషన్ షెడ్ లు, హరితహారం, నర్సరీలు, ఏర్పాటు చేసినట్లు మంత్రి  పేర్కొన్నారు..

స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్తునమని మంత్రి వెల్లడించారు. భూముల సమస్యలను పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టగా తాజాగా డిజిటల్ భూ సర్వే కోసం ప్రభుత్వం 400 కోట్లు కేటాయించింది అన్నారు. ఈ సర్వే పూర్తయ్యాక రాష్ట్రంలో ఎక్కడా కూడా భూతగాదాలు ఉండబోవన్నారు. అవినీతికి అలసత్వానికి తావులేకుండా మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ సత్వరంగా మ్యుటేషన్ చేసుకునేందుకు వీలుగా ధరణిపోర్టల్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు..

గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 1,32,999 ఉద్యోగాలు భర్తీ చేయగా త్వరలో మరో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిరుద్యోగులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోకూడదని  ప్రభుత్వపరంగా ప్రైవేటు రంగాలలో పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతి సాధించి దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తామని మంత్రి  ధీమా వ్యక్తం చేశారు . శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖ బ్రహ్మాండంగా పని చేస్తుందన్నారు..

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పటికీ  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక చొరవ తీసుకొని సొంతంగా వ్యాక్సిన్ కొనుగోలు చేసి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇంటింటి  జ్వర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశామాన్ని, జిల్లాలో కరోనా 7 శాతానికి  వచ్చిందని అన్నారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని అక్షరాస్యత శాతం పెరిగింది అన్నారు..
మరో 6  నెలలో మెదక్  సమీకృత కలెక్టర్ కార్యాలయం అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు.. క్రయ,విక్రయ దారులస సౌకార్యార్థం ఆధునిక సదుపాయాలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను త్వరలో నిర్మించనున్నామని అన్నారు.
అంతకుముందు చిన్న శంకరం పేటలో అమరవీరుల స్తూపానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, జిల్లా ఎస్పీ చందన దీప్తి, అదనపు కలెక్టర్ రమేశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.