పోలీసులకు చిక్కిన మావోయిస్టు పార్టీ డివిజినల్ కమిటీ కార్యదర్శి

106

గత కొద్దిరోజులుగా కోవిడ్ తో భాధపడుతూ మెరుగైన చికిత్సకోసం వరంగల్ నగరానికి వచ్చిన మావోయిస్టు పార్టీ కి చెందిన డివిజినల్ కమిటీ కార్యదర్శితో పాటు ఒక మైనర్ కొరియర్ ను మట్వాడా పోలీసులు అరెస్టు చేశారు..ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానంగా ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేయగా, కారు వెనుక భాగంలో అనుమానస్పదంగా వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి విచారించగా నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్ మరియు మావోయిస్టు పార్టీ కొరియర్ బందుగ వినయ్ లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు అరెస్టు చేసిన డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ కొండపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ కు చెందినవాడు, ఇతను అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999 సంవత్సరంలో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. అనంతరం పార్టీ అదేశాల మేరకు గడ్డం మధుకర్ 2000వ సంవత్సరంలో దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదిలీ అయినాడు. అప్పటినుండి మావోయిస్టు పార్టీ కేంద్ర విభాగాని చెందిన అగ్రనాయకులు నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు, పుల్లూరి ప్రసాద్ రావు ఆలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవోజీ, యాప నారయణ ఆలియాస్ హరిభూషణ్ మరియు హిడుమ ఆదేశాల మేరకు ఛత్తీస్ ఘడ్ పలు విధ్వంసకర సంఘటల్లో పాల్గొనటంతో పాటు పలు మంది పోలీసులను హత్య చేసి వారి అయుధాలను అపహరించడంలో దుర్గం మధుకర్ నిందితుడు.పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ కొరియర్ ( ఇతను మైనర్ కావడంతో వివరాలను వెల్లడించడం వీలుకాదు). ఇతడు పాల్ టెక్నిక్ డిప్లోమో చదువును మధ్యలోనే అపివేసి ఉపాధికోసం కారు డ్రైవర్ గా పనిచేసేవాడు.

ఇదే సమయంలో ఈ మైనర్ కొరియర్ కి జశ్వంత్ అనే మిత్రుడి ద్వారా ఓ భూతగాదా విషయంలో మావోయిస్టు పార్టీ కొరియర్ నామిండ్ల నరేష్ తో పరిచయం అయింది. మావోయిస్టు పార్టీలో కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టుకు మెరుగైన చికిత్స కోసం హన్మకొండలో ఏదైనా హస్పటల్ చేర్పించాల్సిందిగా కొరియర్ నరేష్ ఈ మైనర్ కోరియర్ కి సెల్ ఫోన్ ద్వారా గత నెల 31వ తేదిన కొరియర్ నరేష్ సూచించడంతో, సదరు మైనర్ కొరియర్ ఎటూరునాగారం మీదుగా కారులో బయలుదేరి వెళ్లి వెంకటాపూర్ ఆటవీ ప్రాంతం నుండి కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టు గడ్డం మధుకర్ ను కారు వెనుక భాగం పడుకోబెట్టి హన్మకొండకు తీసుకవస్తుండ గా.. మంగళవారం రోజున ములుగు రోడ్డు ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టు గడ్డం మధు, మైనర్ కొరియర్ పొలిసులకు చిక్కారు.. వారి వద్దనున్న 88వేల ఐదువందలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు కోవిడ్ భాధపడుతూ చాల నీరసంగా వున్న మావోయిస్టు గడ్డం మధును పోలీసులు మెరుగైన చికిత్స అందించేందుకు హస్పటల్ లో చేర్పించామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. కోవిడ్-19తో భాధపడుతు మెరుగైన చికిత్స కోసం వచ్చిన పోలీసులకు చిక్కిన మావోయిస్టు గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కి చెందిన సూమారు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కోవిడ్ తో బాధపడుతున్నారని చెప్పారు..

వారిలో కేంద్ర కమిటీ నేత కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారాయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు ఆలియాస్ దామోదర్,కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ , కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా వున్నారు. వీరు కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు మావోయిస్టు పార్టీ వీరికి అనుమతించడం లేదని… కేవలం ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మాత్రమే కోవిడ్ తో గురైనవారికి మెరుగైన చికిత్స పొందేందుకు మాత్రమే పార్టీ అనుమతి ఇవ్వడం జరుగుతోందని.గత పదిరోజుల క్రితం బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ క్యాంపును వ్యతిరేకిస్తూ చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిర్వహించిన నిరసన సమయంలో కోవిడ్ లక్షణాలు వున్న ప్రజలను మావోయిస్టు నాయకులు, సభ్యులు కలవడం ద్వారా వీరికి సైతం కోవిడ్ 19 సక్రమించింది..

అదేవిధంగా దామోదర్ కు గార్డ్ గా వ్యవహరిస్తున్న మవోయిస్టు సభ్యుడు కోవిడ్ కు గురై చికిత్స కోసం మావోయిస్టు పార్టీ క్యాంపు నుండి తప్పించుకోని పారిపోతుండగా మావోయిస్టు పార్టీకి చెందిన మిలిషియా సభ్యులు పట్టుబడ్డాడు. అనంతరం సదరు మావోయిస్టుకు కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు పార్టీ అనుమతి ఇవ్వలేదని పోలీస్ కమిషనర్ తెలిపారు.మావోయిస్టు పార్టీ కార్యకర్తల ప్రాథమిక మానవ హక్కులను కాలరాస్తోందని. పార్టీ కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స పొందేందుకు కూడా బయటకి వెళ్ళడానికి కూడా, మావోయిస్టు పార్టీ అనుమతి ఇవ్వకుండా అమానవీయంగా వ్యవరిస్తూన్నట్లుగా పై సంఘటనల ద్వారా తెలుస్తోందని. కోవిడ్ 19 లేదా ఇతర వ్యాధులతో భాదపడుతున్న మావోస్టులు నాయకులు లేదా కార్యకర్తలందరికి స్వేచ్ఛగా భయటకి వచ్చిన వారికి రాష్ట్రప్రభుత్వం తరుపున మెరుగైన చికిత్స అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.