రెజీనా రాష్ట్ర భక్తికి జోహార్లు…

524

అది కొట్లాడి తెలంగాణ సాధించుకున్న మధుర దినం. ఆ జ్ఞాపకాల దొంతరలో ఏళ్లపాటు జరిగిన ప్రజాయుద్ధం దొర్లిపోయాయి. ఆ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని  యావత్ తెలంగాణ సమాజం నిండు హృదయంతో సంబరం  చేసుకుంది. తెలంగాణ కల సాకారం కోసం కేసీఆర్ పడిన కష్టం, చేసిన శ్రమను మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుండా జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టారు. మంత్రుల నుంచి నౌకర్ల వరకూ, ఐపిఎస్ నుంచీ హోంగార్డు వరకూ తెలంగాణ ఆవిర్భావదినోత్సం రోజున జాతీయ జెండాకు భక్తితో జైకొట్టారు.  ఇవి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కనిపించిన దృశ్యాలే. కానీ… టీఆర్‌ఎస్‌కు చెందిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెజీనా షమీం మాత్రం,  అసలు ఆ జెండా వందనాలు తనకు పట్టనట్లు, సెల్యూట్లకు అతీతంగా మౌనంగా నిల్చుని తన ‘రాష్ట్ర భక్తి’ని ప్రదర్శించిన వైచిత్రి, ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పక్కనే మేయర్ గుండు సుధారాణి, మంత్రి సహా పోలీసులు జాతీయ జెండాకు సెల్యూట్ కొడుతుంటే, ‘రాష్ట్ర భక్త రెజీనా’ మాత్రం అసలు సెల్యూట్ కొట్టకుండా.. నింపాదిగా నిల్చున్న ఆ దృశ్యం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమయింది. ఏదేమైనా రెజీనా రాష్ట్ర భక్తికి జోహార్లు.