తెలంగాణ ఆవిర్భావం.. పెనం మీద నుండి పోయిలో పడ్డట్టు!

439

సామాన్యుడు కలలు కన్న తెలంగాణ ఆవిర్భవించలేదు.కెసిఆర్  తన కోసం, తన కుటుంబం కోసం కలలు కన్న తెలంగాణ సాధించుకున్నారు. అమర వీరులు కలలు కన్న తెలంగాణ అందనంత దూరంలో ఉండి పోయింది. నీళ్ళు,నిధులు నియామకాల జాడే లేదు, విద్య,వైద్య రంగాలు సర్వ నాశనం అయినాయి, పనికి రాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు.
ఆర్థికంగా రాష్ట్రం చితికి పోయింది.ప్రభుత్వం నడప లేని పరిస్థితి లో, ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టినాడు, అవి ఒడిసిన తరువాత రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ప్రజల పరిస్థితి ఏమిటి?
తనకు చెంచా గిరి చేస్తున్న నాయకులు, అక్రమ సంపాదన చేసి ఆర్థికంగా బాగు పడ్డారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న  కవులు, కళాకారులు పైసలకు పదవులకు అమ్ముడు పోయి,తెలంగాణ ద్రోహుల జాబితాలో చేరి పోయారు. తెలంగాణలొ సామాన్యుడు చదువును కొన లేడు వైద్యం కొనలేడు, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.మేధావులు గొంతు విప్పడానికి బయపడుతున్నారు. వారి మౌనం అభివృద్ధికి తొలి సమాధి. అమరుల ఆశయం గంగలో కలిసి పోయింది, తెలంగాణ ఆవిర్భావం పెనం మీద నుండి పోయిలో పడ్డట్టు అయింది. 64 సం”రాల ఉమ్మడి పాలన లో జరగని దోపిడీ 7 సం”రాల స్వయం పాలనలో  జరిగింది.లక్షల ఎకరాల భూమి అక్రమణకు గురి అయింది, బహుజన వర్గాలు అధికారానికి మరింత దూరం అయినాయి. అణచివేతకు గురి అవుతున్నాయి. అమరులు సామాన్య ప్రజలు కలలు కన్న తెలంగాణ కోసం పోరాటం తప్పదు.

–  నారగొని ప్రవీణ్ కుమార్,                   సామాజిక కార్యకర్త,తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు  9849040195