టీకా ధరలపై నియంత్రణ అవసరం: స్వదేశీ జాగరణ్ మంచ్

98

ప్రపంచ జనాభా ఈ రోజు కరోనా భయంతో అల్లకల్లోలమవుతుంది. ఈ వ్యాధి నివారణకు మందులు మరియు వ్యాక్సిన్లపై పేటెంట్ల కారణంగా పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్య హక్కులు ఉన్నందున, అవి అందరికీ అందుబాటులోకి ఈ రోజుకీ రాలేదు. ప్రజలందరూ సమానంగా జీవించంచడమనేది సార్వత్రిక ప్రాథమిక హక్కు. వాక్సిన్ తయారుచేసిన కొన్ని కంపెనీలు పేటెంట్ల ద్వారా లాభాలు సంపాదించడానికి
అపరిమిత హక్కులు ఇవ్వడం ద్వారా, కోట్ల మంది ప్రజల జీవన ప్రాథమిక హక్కు రాజీ పడుతోంది, అలా జరగడానికి వీలులేదు. ఈ టీకాలు మరియు ఔషధాలను చౌకగా మరియు అందుబాటులోకి తీసుకురావడానికి, ఈ వ్యాక్సిన్లు మరియు ఔషధాల యొక్క సాంకేతికతను పేటెంట్ రహితంగా మార్చడానికి భారత ప్రజలు ఒక విస్తృతమైన ప్రచారాన్ని చేస్తున్నారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన అనేక మందులు స్థానికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కరోనా సమస్య యొక్క తీవ్రత కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అందుబాటులో ఉన్న టీకాల పరిమాణం సరిపోదు.

ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ దేశాల వయోజన జనాభాకు దాదాపుగా పూర్తి టీకాలు వేసిన కారణంగా ఈ దేశాలలో కరోనా సంక్షోభం ఇంచుమించు ముగిసింది. అందువల్ల, భారతదేశంతో సహా ప్రపంచంలోని మిగతా మొత్తం జనాభాకు వెంటనే టీకాలు వేయడం అవసరం.ఇందుకోసం, స్వదేశీ జాగరణ్ మంచ్ దేశం మొత్తంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది, కోవిడ్ వ్యాక్సిన్లు మరియు ఔషధాలను
పేటెంట్ రహితంగా మార్చాలని మరియు వాటిని ఉత్పత్తి చేయగల అన్ని ఉత్పత్తిదారులకు వాక్సిన్ మరియు మెడిసిన్స్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ప్రపంచం మొత్తానికి అందుబాటు ధరలలో టీకాలు మరియు ఔషధాలు లభించాలి; అని కోరుతూ దేశ వ్యాప్త ఉద్యమం ప్రారంభించబడింది. ఈ ప్రయత్నం లో భాగంగా, వెబినార్లు, సెమినార్లు, ప్రదర్శనలు మొదలైనవి
నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ సంతకాల సేకరణ ద్వారా పేటెంట్ ఫ్రీ టీకాలు కోసం జనాందోళనను స్వదేశీ జాగరణ మంచ్ ప్రారంభించింది. భారతదేశ జనాభాలో కనీసం 70% మందికి టీకాలు వేయడానికి 200 కోట్ల డోసుల టీకాలు అవసరం. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది, దీని కోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి మరియు పేటెంట్లు మరియు వాణిజ్య రహస్యాలతో సహా మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన అడ్డంకులను అధిగమించడానికి అన్నిరకాల చర్యలు అవసరం. వ్యాక్సిన్ మరియు ఔషధాల యూనివర్సల్ యాక్సెస్; పిటిషన్ ద్వారా ఈ దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న వివిధ
సామాజిక, సాంస్కృతిక సంస్థలు, విద్యాసంస్థలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయమూర్తుల నుండి స్వదేశీ జాగరణ మంచ్ చేపట్టిన మహత్తర కార్యానికి సహకారం కోరుతుంది. దీనికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలతో స్వదేశీ జాగరణ మంచ్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలు కలిసి అంతర్జాతీయ సమావేశాన్ని 20 మే 2021 న నిర్వహించాయి. దీనిలో అమెరికా నుండి హోవార్డ్
విశ్వవిద్యాలయం వారు పాలుపంచుకోవడం జరిగింది.

TRIPS ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పేటెంట్స్ మాఫీ కోరుతూ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికాతో కలిసి అక్టోబర్‌లోనే పేటెంట్ రహిత వ్యాక్సిన్లు మరియు ఔషధాలను సులభతరం చేయడానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో చేసిన ప్రతిపాదనకు 120 దేశాలు ఇప్పటివరకు మద్దతు ఇచ్చాయి. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే దేశాలు/ కంపెనీలు/వ్యక్తుల సమూహాలను ఎటువంటి సంకోచం లేకుండా స్వదేశీ జాగారణ మంచ్ వ్యతిరేకిస్తూ, ప్రపంచ ప్రజల మానవత్వం కోసం, సమాజం మొత్తాన్ని భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు మద్దతు తెలపాలని స్వదేశీ జాగరణ మంచ్ కోరుతుంది.

ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలను మరియు WTO ని UVAM (Universal Access to Vaccines and Medicines) విజ్ఞప్తి చేస్తుంది:

1. ప్రస్తుతం టీకాలు ఉత్పత్తి చేస్తున్న అన్ని కంపెనీలు టీకాల ఉత్పత్తిని పెద్ద మొత్తంలో పెంచడానికి, సాంకేతిక బదిలీ, ముడి పదార్థాల
లభ్యత, వాణిజ్య రహస్యాలు సహా అన్ని సౌకర్యాలను టీకాలు తయారుచేయడానికి ముందుకు వచ్ఛే ఇతర కంపెనీలతో
పంచుకోవాలి.
2. రెమ్‌డెసివిర్, ఫావిరాసిర్, తోసిలుజుమాబ్ మరియు మోల్నుపిరవిర్ వంటి కొత్త ఔషధాలు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి చర్యలు
తీసుకోవాలి.
3. ప్రపంచ స్థాయిలో టీకాలు మరియు ఔషధాలు తగినంత ఉత్పత్తితో పాటు ధరలను సమర్థవంతంగా నియంత్రించండానికి చర్యలు
తీసుకోవాలి.

TRIPS ద్వారా పేటెంట్స్ మాఫీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి WTO, G-7, G-20 మరియు ఇతర సంస్థల ద్వారా దౌత్య ప్రయత్నాలను
వేగవంతం చేయాలి.

స్వదేశీ జాగరణ మంచ్ ప్రయత్నం ద్వారా భారతదేశం మరియు మరో 20 దేశాల నుండి డిజిటల్ సంతకం ప్రచారంలో ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది పిటిషన్స్ పై సంతకం చేశారు. మరో పిటిషన్‌లో భారతదేశం మరియు విదేశాల నుండి 1600 మంది ఉన్నత విద్యావేత్తలు / వైస్ చాన్సెలర్స్ ఈ విధంగా సంతకం చేశారు:
1. ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి హక్కుల నిబంధనలను సడలించాలి.
2. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ తయారీదారు మరియు వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఇతర
తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో సహా పేటెంట్ రహిత హక్కులను స్వచ్ఛందంగా ఇవ్వాలి.
3. పేటెంట్ హోల్డర్లు కాకుండా అన్ని రకాల ఇతర ఔషధ తయారీదారులు టీకాలు మరియు ఔషధాల తయారీకి కావలసిన సాంకేతిక
పరిజ్ఞానం మరియు ఉత్పత్తి సామగ్రి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అటువంటి ఔషధ తయారీదారులకు ప్రోత్సాహం
ఇవ్వాలి.
4. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి, టీకాలు మరియు ఔషధాలను ప్రపంచo మొత్తానికి లభించే విధంగా, దేశభక్తిగల ప్రజలు,
సంబంధిత సంస్థలు ముందుకు వచ్చి మానవాళిని రక్షించే ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకోవాలని కోరడమైనది.