పేకాట అడ్డా – నిజాంపట్నం గడ్డ!

861

– అధికార పార్టీ ఎంపీ అనుచరుల కనుసన్నల్లో కోట్ల రూపాయల పేకాట 
– ఎస్‌ఈబీ దాడులతో ఉలిక్కిపడ్డ  పేకాటరాయుళ్లు.  

ఆయన ఓ ఎంపీ. అందులోనూ అధికారపార్టీ ఎంపీ. పైగా పాలకుడికి బాగా సన్నిహితుడన్న పేరు. ఆయన కోసం చాలా త్యాగాలు చేశారన్న ప్రచారం. ఇంకేముంది? తన ఇలాకాలో ఏకంగా పేకాట దుకాణం పెట్టేశారు. ఆడినవారికి ఆడుకున్నంత. అధికార పార్టీ ఎంపీ కాబట్టి.. అటువైపు పోలీసులెవరూ రారన్న ధీమా. ఎందుకంటే అదంతా ‘మామూలే’ కాబట్టి. సమైక్య రాష్ట్రంలో చిలకలూరిపేటలో కూడా ఇలాగే ఓ క్లబ్‌లో పైవారి ఆశీస్సులతో పేకాట రాజ్యం నిర్నిరోధంగా నడిచింది. ఇప్పుడు రేపల్లెలో. ఊరిపేర్లే తేడా. మిగిలినదంతా సేమ్‌టు సేమ్. కానీ.. ఎక్కడో ఏదో తేడా వచ్చింది. రేపల్లె వద్ద నడుస్తున్న ఈ దందా ఎస్‌ఈబీకి తెలిసింది. మరి తెలిసిందా? తేడాలొచ్చి తెలిసేలా చేశారో తెలియదు. కానీ రైడింగయితే జరిగింది. ఇక కథలోకి వెళదాం.

    గుంటూరు జిల్లాలో ఓ అధికార పార్టీ ఎంపీ అనుచరులు పెద్ద ఎత్తున పేకాట –   శిబిరం నడుపుతున్నారు. రేపల్లె నియోజకవర్గం లోని సముద్ర తీర ప్రాంతంలో నిత్యం పేకాట శిబిరం కొనసాగింది. నిజాంపట్నం మండలం చింతరేవు సమీపంలోని  మైదాన ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ లలో రాత్రింభవళ్లు నిర్విరామంగా పేకాట నడుస్తుంది. గుంటూరు జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పేకాట కోసం బడా బాబులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన వారికి సకల సౌకర్యాలు నిర్వాహకులు కల్పిస్తున్నారు. విందు , మందు పూర్తి స్థాయి లో అందుబాటులో ఉంచుతూ ఎవరికి నచ్చిన ఫుడ్ , మందు వారికి క్షణాల్లో వారి ముందు ఉంచుతున్నారు. దీంతో ఈ శిభిరానికి వచ్చిన వారు రాత్రింభవళ్లు అక్కడే ఉండి లక్షల పెట్టి పేకాట ఆడుతున్నారు.
అధికార పార్టీ ఎంపీ కు చెందిన శిబిరం కావడం తో పోలీసులు ఎవ్వరూ ఈ శిబిరం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇందుకు ప్రతిఫలంగా పోలీసులకు నెల మాముళ్లు పెద్ద మొత్తంలో అందుతున్నట్లు ప్రచారం. స్దావిక స్టేషన్ నుంచి జిల్లా పెద్దల వరకు పేకాట నిర్వాహకుల నుంచి లక్షల్లో మాముళ్లు అందుతున్నట్లు సమాచారం. గత ఏడాదికి లేదా ఇక్కడ పేకాట శిబిరం యదేచ్చగా కొనసాగింది.  ఈ పేకాట శిబిరం వైపు కనీసం మీడియా ప్రతినిధులు కూడా వెళ్లలేని పరిస్థితి వెళితే కొట్టి చంపేసేందుకు కూడా నిర్వాహకులు వెనుకాడని పరిస్థితి. ఈ పేకాట శిబిరం నుంచి అధికార పార్టీ ఎంపీకీ కోట్లాది రూపాయలు రాబడి వస్తున్నట్లు సమాచారం. ఇలా హ్యాపీ గా సాగిపోతున్న పేకాట శిబిరం పై గత రాత్రి   ఎస్‌ఈబీ  ( Special enforcement Beuro) అధికారులు ఆకస్మిక  దాడులు చేసారు.  ఈ దాడి సమయంలో 75 మంది పేకాట రాయుళ్లు పట్టుబడగా వారి నుంచి 50 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం .

 ఎస్‌ఈబీ ఏఎస్పీ హాఫీజ్ ఆధ్వర్యంలో లోని బృందం గత రాత్రి వేళ ఆకస్మికంగా దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారు.  అయితే నిజాంపట్నం మండలం చింతరేవు వద్ద ఏర్పాటు చేసిన ఈ పేకాట డెన్ అధికార ఎంపీ అనుచరులది  అయినప్పటికీ ,  మరి ఇప్పడు స డన్ గా శిబిరం పై రైడ్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాడులు చేసిన అధికారులు కూడా దీనిపై మీడియా కు సమాచారం ఇవ్వడానికి జంకుతుండటం పలు అనుమానాలకు తావిస్తుంది.
నెల మాముళ్లు తీసుకుంటూ ఏడాదికి పైగా పేకాట శిబిరం పై కన్నెత్తి చూడని పోలీసులు ఇప్పడు ఇంత అకస్మాత్తుగా దాడి చేయడం  చర్చ నీయం గా మారింది. ప్రభుత్వ పెద్దల దృష్టి కి పేకాట శిబిరం వ్యవహారం చేరడం తో , తప్పనిసరి పరిస్థితుల్లో దాడి చేశారా… లేక మాములు అందడంలో ఆలస్యం అయి దాడి చేశారా అనే చర్చ జిల్లాలో జోరగా చర్చ జరుగుతుంది.