త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో సత్య ప్రమాణం చేసిన జీవీ

124

శివశక్తి లీలా అండ్ అంజన్ పౌండేషన్ కు NRI ఫండ్స్ వస్తున్నాయని అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని జీవీ ఆంజనేయులు సవాల్ చేస్తే భయంతో స్వీకరించని ఎమ్మెల్యే బొల్లా ఈ నెల 28న సత్య ప్రమాణానికి కోటప్పకొండకు వెళ్తున్న జీ.వీ ఆంజనేయులు ముందస్తు నోటీసులు ఇప్పించి పోలీసులచే అడ్డుకున్నారు. తమ ఫౌండేషన్ కు ఎటువంటి ఫండ్స్ రావడం లేదంటూ తన సొంత డబ్బుతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని చేసిన వాగ్దానం ప్రకారం సోమవారం జీ.వీ ఆంజనేయులు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి నందీశ్వరుని సాక్షిగా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో సత్య ప్రమాణం చేశారు.