అర్హులైన వారందరికి వ్యాక్సిన్:పద్మారావు

143

కోవిడ్ కట్టడికి లాక్ డౌన్ వంటి చర్యలతో పాటు అర్హులైన వారందరికి వ్యాక్సిన్ అందించడమే మంచిదని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, అందుకే టీకా పంపిణీ ప్రక్రియకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

  సితఫలమండీ లో సికింద్రాబాద్ నియోజకవర్గ  సూపర్ స్ప్రేడర్స్  ప్రత్యేక టీకా కేంద్రాన్ని అయన ఆదివారం తనిఖీ చేశారు. జోనల్ కమీషనర్  శ్రీనివాస్ రెడ్డి, ఉప కమీషనర్  మోహన్ రెడ్డి లతో పాటు అధికారులు ఆ పర్యటనలో పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా  ప్రత్యెక వ్యాక్సినేషన్ ప్రక్రియను  చేపడుతోందని, సూపర్ స్ప్రేడర్స్ గా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కనీసం 15 వేల మంది సూపర్ స్ప్రేడర్స్ కు 10 రోజుల్లో టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, ఆ తరువాత అర్హులైన వారందరికి టీకా ఇప్పిస్తామని  పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రజలతో అయన ఈ సందర్భంగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.