భారత్ నుంచి విమానాల రాకపోకలపై యూఏఈ నిషేధం..!

640

దుబాయ్ : భారత్ నుంచి విమానాల రాకపోకలపై యూఏఈ నిషేధాన్ని జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడానికి  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారతదేశం నుంచి ప్రయాణికుల విమాన సర్వీసుల రాకపోకలను జూన్ 30వతేదీ వరకు నిలిపివేసింది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య  పెరిగిన తర్వాత ఏప్రిల్ 25వ తేదీ నుంచి భారత్ నుంచి విమానాల రాకపోకలపై యూఏఈ నిషేధం విధించింది. జూన్ 30వ తేదీ వరకు భారతదేశం నుంచి ప్రయాణికుల విమానాలను నిలిపివేశామని యూఏఈ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా క‌లిగిన‌వారు, కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటించే దౌత్య‌వేత్త‌ల ప్ర‌యాణానికి మిన‌హాయింపులు ఉంటాయ‌ని తెలిపింది.